YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

న్యూ ఢిల్లీ జనవరి 28
మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. మహారాష్ట్రలో 12 మంది బీజేపీ శాసనసభ్యులపై ఉన్న సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధమని ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని పేర్కొంది. స్పీకర్ స్థానంలో ఉన్న ప్రిసైడింగ్ అధికారితో అనుచితంగా ప్రవర్తించినందుకు గారు వీరిపై గతేడాది జూలైలో 12 నెలల పాటు నిషేధం విధించారు. అయితే.. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు సస్పెన్షన్ను రద్దు చేస్తూ.. తీర్పు వెలువరించింది.  స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల కోసం సమాచారం సిద్ధం చేసేందుకు 2011 నాటికి జనాభా గణాంకాలను రాష్ట్ర బీసీ కమిషన్కు అందించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మహారాష్ట్ర అసెంబ్లీలో గత ఏడాది జూలైలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ సందర్భంగా సభలో గందరగోళం తలెత్తింది. కొందరు బీజేపీ నేతలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. అక్కడ ఉన్న ప్రిసైడింగ్ అధికారితో వాదనకు దిగారు. దీంతో తొలుత సభ వాయిదా పడింది. ఒకే రోజు  నాలుగు సార్లు సభను వాయిదావేసే పరిస్థితి వచ్చింది.   అనంతరం సభ సమావేశమైన తర్వాత.. స్పీకర్ స్థానంలో ఉన్న జాదవ్.. ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల పట్ల తాను దురుసుగా ప్రవర్తించానని వచ్చిన ఆరోపణను కొట్టిపారేశారు. ఈ ఆరోపణ నిజమని తేలితే ఏ శిక్ష విధించినా తనకు అభ్యంతరం లేదని అన్నారు. ఈ సమయంలోనే ఆందోళనకు దిగిన బీజేపీ సభ్యులు 12 మంది పై 12 నెలల కాలంపాటు సస్పెన్షన్ వేటు వేశారు. అయితే.. దీనిని తాజాగా సుప్రీం కోర్టు రద్దు చేసింది. అయితే.. ఇటీవల రాజ్యసభలో ఆందోళన చేశారంటూ.. 10 మంది సభ్యులను రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సస్పెండ్ చేశారు. వీరిని తిరిగి సభలోకి తీసుకోవాలని.. సస్పెన్షన్ ఎత్తేయాలని ఎంత ప్రయత్నించినా.. ఎన్ని విధాల బ్రతిమాలినా ఆయన పట్టించుకోకపోవడం గమనార్హం. దీనిపై రాజకీయ పక్షాల్లో పెదవి విరుపు కనిపిస్తోంది. 

Related Posts