YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎన్‌సీసీ ర్యాలీలో స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రధాని మోడీ తలపాగ

ఎన్‌సీసీ ర్యాలీలో స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రధాని మోడీ తలపాగ

న్యూ ఢిల్లీ , జనవరి 28 
ఢిల్లీలోని కరియప్పా గ్రౌండ్‌లో జరిగిన నేషనల్ క్యాడెట్ కార్ప్స్  ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శుక్రవారం ఢిల్లీలోని కరియప్పా గ్రౌండ్‌లో జరిగిన నేషనల్ క్యాడెట్ కార్ప్స్  ర్యాలీకి హాజరైన ప్రధాని మోదీ సిక్కు క్యాడెట్ తలపాగా ధరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గార్డ్ ఆఫ్ హానర్‌ను పరిశీలించారు. ఎన్‌సీసీ ద్వారా మార్చి పాస్ట్‌ను సమీక్షించారు. గతంలో తాను కూడా ఎన్‌సీసీలో చురుకుగా పాల్గొన్నానని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేసుకొన్నారు. న్యూఢిల్లీలోని కరియప్ప మైదానంలో నేషన్ క్యాడెట్ కార్ప్స్ ర్యాలీని ప్రధాని మోడీ శుక్రవారం నాడు పరిశీలించారు. ప్రతి ఏటా జనవరి 28 రిపబ్లిక్ డే సందర్బంగా జరిగిన క్యాంప్ ముగింపును నిర్వహించనున్నారు.ఆర్మీ యాక్షన్, స్లిథరింగ్ మైక్రోలైట్ ఫ్లయింగ్, పారా పైలింగ్ తో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎన్‌సీసీ క్యాడెట్లు తమ నైపుణ్యాలను ప్రధాని వీక్షించారు.. అత్యుత్తమప్రతిభను కనబర్చిన ఎన్‌సీసీ క్యాడెట్లకు ప్రధాని మోడీ పతకాలను ప్రధానం చేశారు.ఈ సందర్భంగా ఎన్‌సీసీ క్యాడెట్లను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ప్రస్తుతం ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకొంటున్న సమయంలో ఎన్‌సీసీ ర్యాలీ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తాను కూడా మీ మాదిరిగానే ఎన్‌సీసీలో చురుకుగా క్యాడెట్ గా ఉన్నందుకు తాను గర్వ పడుతున్నానని ఆయన చెప్పారు. ఎన్‌సీసీలో తాను నేర్చుకొన్న శిక్షణ తనకు ఉపయోగపడుతుందని మోడీ చెప్పారు.నేను కూడా ఎన్‌సిసిలో క్రియాశీల సభ్యునిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. ఎన్‌సిసిని బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. పెద్ద సంఖ్యలో బాలికల క్యాడెట్లు ర్యాలీలో పాల్గొన్నారు, ఇది ఈ రోజు భారతదేశం చూస్తున్న మార్పు” అని ప్రధాని మోడీ ప్రసంగించారు.అయితే  స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలలో ప్రధానమంత్రి మోడీ  సార్టోరియల్ ఎంపికలలో తలపాగాలు హైలైట్‌గా నిలుస్తున్నాయి.

Related Posts