బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నోటికి వచ్చినట్లు మాట్లాడి మోసం చేసాడు. అందుకే తిరుపతిలో దాడి జరిగిందని కాంగ్రెస్ సినీయర్ నేత వి హనుమంతరావు వ్యాఖ్యానించారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. దేశమంతా ఇదేపరిస్థితి వస్తుంది. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆగ్రహం చవి చూడక తప్పదు. అమిత్ షాకు జరిగింది చిన్నదాడి. ఇంకా ముందుందని హెచ్చరించారు. బీజేపీ మోసాన్ని భరించలేకే కర్ణాటకలో కాంగ్రెస్ కు చంద్రబాబు మద్దతు ఇచ్చారు. కేసీఆర్ హయం లో 3,600 మంది రైతులు మరణించారు. ఒక్కరిని కూడా పరమర్శించలేదని విమర్శించారు. కెసీర్ , మోడీ మధ్య ఒప్పందం ఉంది. అందుకే కెసీర్ కు 6 వేలకోట్ల రూపాయలు వచ్చాయి. దేవగౌడకు కెసీర్ మద్దతు ఇచ్చారు. జేడీయూకు వోటు వెయ్యడం అంటే బీజేపీకి ఓట్ వేసినట్లేనని అయన అన్నారు. రైతులు చచ్చినప్పడు ఎవరు పరమర్శించలేదు . అందుకే కెసీఆర్ రైతు బంధు కార్యక్రమానికి మమతా బెనర్జీ , స్టాలిన్ హాజరు కాలేదు. రైతు బంధుతో 40, 50 ఎకరాలు వారికే లబ్ది చేకూరుతుంది. తెరాస కార్యకర్తలకు డబ్బులిచారు. కాంగ్రెస్ వారికి డబ్బులు ఇవ్వలేదని అయన అన్నారు. కేవలం ఎన్నికలకోసమే కెసీర్ రైతు బంధు పథకం ప్రారంభించారని వీహెచ్ అన్నారు.