రాయ్ పూర్
చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. మూడు వాహనాలకు నిప్పుపెట్టి వెళ్లిపోయారు. జిల్లా కేంద్రానికి 55 కిలోమీటర్ల దూరంలోని హిరంగై ఝరా గ్రామంలో ఈ ఘటన జరిగింది. జగదల్పూర్ నుండి మూడు ట్రక్కులు సెమల్ కలప కోసం నారాయణపూర్‌కు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, కేంద్ర బలాగాలుగాలింపులు ప్రారంభించారు. నారాయణ్ పూర్ ఎస్పీ గిరిజా శంకర్ వాహనాల దగ్ధం జరిగిన విషయాన్ని ధ్రువీకరించారు