ఎన్నికల హామీలను విస్మరించిన కేంధ్రం తీరుపై వైకాపా ఎంపీలు పోరుబాటను ఉదృతం చెయ్యనున్నారు. ఏపీలో జగన్ చేపట్టిన పాదయాత్ర రెండు వేల కిలోమీటర్ల మైలు రాయిని అధిగమిస్తున్న సమయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయల ఎదుట ధర్నాకు నేతలు సమాయ త్తమవుతున్నారు. ఈ మేరకూ అనంతపురం జిల్లా జిల్లా ఇన్ చార్జి మిధూన్ రెడ్డి ఆద్వర్యంలో నేతలు భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేశారు. ఈనెల 15, 16 తేదీల్లో పాదయాత్రలు నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. జగన్ సంఘీభావంగా భారీ ఎత్తున పాదయాత్రలు చేపడుతున్నట్లు చెప్పారు.