న్యూ ఢిల్లీ జనవరి 29
పాశ్చాత్య దేశాల్లో ఒక బిడ్డకు తండ్రి కావడానికే జంటలు అయిష్టం చూపిస్తున్నాయి. చాలా దేశాల్లో ఒక బిడ్డ ముద్దు.. అధిక సంతానం వద్దు అంటున్నారు. చైనా భారత్ లాంటి దేశాల్లోనూ జనాభా నియంత్రణ పాటిస్తున్నారు. ఎందుకంటే ఒక బిడ్డను సాకడానికి.. చదివించడానికి నానా కష్టాలు పడుతున్నారు. రెండో బిడ్డ వద్దంటున్నారు.
అయితే ఓ వ్యక్తి మాత్రం డిఫెరెంట్.. ఇప్పటికే అతడు 129 మంది పిల్లలకు తండ్రయ్యాడు. 150మంది పిల్లలకు తండ్రి కావడం అతడి ధ్యేయమట.. 66 ఏళ్ల ఓ వ్యక్తి నలుగురు ఐదుగురు కాదు.. ఏకంగా వందమందికి పైగా సంతానానికి తండ్రి కావడం కంకణం కట్టుకున్నాడు. ఇప్పుడది 150కి టార్గెట్ పెట్టుకున్నాడు.అయితే శృంగారం చేసి అతడు పిల్లలకు తండ్రి కాలేదు. వీర్యదానం చేసి. చాలా దేశాల్లో వీర్యదానంపై ఎటువంటి నియమ నిబంధనలు లేవు. చట్టాలు కూడా అనుమతిస్తాయి. అలా ఓ వ్యక్తి ఏకంగా 129 మంది పిల్లలకు తండ్రయ్యానని.. మరో 9మంది గర్భం ధరించారని.. చెబుతున్నాడు.యూకేకు చెందిన జోన్స్ ప్రపంచంలోనే అత్యంత ఫలవంతమైన స్పెర్మ్ దాత. యూకేలోని డెర్బీలోని చాడెస్ డెన్ లో నివసిస్తున్న 66 ఏళ్ల రిటైర్డ్ టీచర్ క్లైవ్ జోన్స్ తొమ్మిదేళ్లుగా తన స్పెర్మ్ ను దానం చేస్తున్నట్లు చెబుతున్నాడు. జోన్స్ 58 ఏళ్ల వయసులో స్పెర్మ్ విరాళం ఇవ్వడం ప్రారంభించడంతో అధికారికంగా స్పెర్మ్ దాతగా గుర్తింపు పొందలేకపోయాడు. ఎందుకంటే యూకేలో స్పెర్మ్ ఇవ్వాలనుకునే వ్యక్తి 45 ఏళ్లలోపు ఉండాలనే నిబంధన ఉంది. తాను ఇప్పటివరకూ స్పెర్మ్ ఇచ్చినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోలేదని వెల్లడించాడు. మరికొన్నేళ్లపాటు వీర్యదానం చేస్తానని.. 150 మందికి తండ్రి అయిన తర్వాత వీర్యదానం చేయనని జోన్స్ చెబుతున్నారు. తాను ఫేస్ బుక్ ద్వారా కస్టమర్లతో కనెక్ట్ అయ్యి ఉచితంగా వీర్యదానం చేస్తున్నట్లు చెబుతున్నారు. బ్రిటన్ లో చాలా క్లినిక్ లలో వీర్యాన్ని అమ్ముతున్నట్లు తెలిపాడు. ఒకరికి ఆనందాన్ని ఇవ్వడం.. వారికి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తాను సంతోషపడుతున్నానని క్లైవ్ చెబుతున్నాడు. తనకు వచ్చే మెసేజ్ లు పిల్లల ఫొటోలు చూస్తే ఆనందం వేస్తుందన్నారు.తాను తండ్రులుగా చెప్పుకుంటున్న 129మందిలో ఇప్పటివరకూ 20మందిని మాత్రమే కలిశానని జోన్స్ చెప్పాడు.