గూడూరు
నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని అరుంధతి పాలెం లో సూరిపాక ప్రకాష్ అతని భార్య పుష్ప నివసిస్తున్నారు. వీరిద్దరూ మున్సిపాలిటీలో కాంట్రాక్టు కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ప్రకాష్ మద్యానికి బానిసై సక్రమంగా పనికి వెళ్లకపోవడంతో విధుల నుంచి తప్పించారు. భార్య పుష్ప పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. గత రాత్రి మద్యం తాగడానికి డబ్బులు కావాలని భార్యతో గొడవ పడ్డాడు. పనికి వెళ్లకుండా మధ్యాహ్న కి బానిసై ఆరోగ్యం చెడిపోతుందని భార్య వాదించడంతో కోపంతో ఇనుప రాడ్తో తల మీద కొట్టడంతో తల పగిలి పుష్ప మృతి చెందింది. సమాచారం అందుకున్న పట్టణ సీఐ నాగేశ్వరమ్మ,ఎస్సై పవన్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు