విశాఖపట్నం జనవరి 29
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డికి విశాఖపట్నం ప్రజలు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. విశాఖలో కరోనా వైరస్ ఉద్ధృతంగా ఉన్న సమయంలో విజయసాయి రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వస్తోన్నాయి. వరుసగా రెండు రోజులపాటు సీమత్మదారలో ఎంపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఇప్పటికే కరోనా కారణంగా జిల్లా కలెక్టర్, మేయర్ స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటే, ఎంపీ మాత్రం ప్రజాదర్బార్ నిర్వహించడమేమిటని చాలా మంది మండిపడుతున్నారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ప్రజాదర్బార్ నిర్వహణ ఎంతవరకు సమంజమని ప్రతిపక్షాల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో విజయసాయి రెడ్డికి కరోనా పాజిటివ్ వస్తే హైదరాబాద్ వెళ్లి చికిత్స చేయించుకోని వచ్చారు. ఆయనకు బాగా ఆర్థిక స్థోమత ఉంది కాబట్టి హైదరాబాద్ వెళ్లి చికిత్స చేయించుకోచ్చారని, మరీ ప్రజాదర్బార్ కారణంగా సామాన్య ప్రజలకు వైరస్ సోకితే ఎవరు చికిత్స చేయిస్తారు, వారికి ఎవరు ఆర్థిక సాయం చేస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.