హైదరాబాద్ జనవరి 29
సోమవారం నుంచి తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆదివారంతో తెలంగాణలో విద్యాసంస్థలకు ఇచ్చిన సెలవులు ముగియనున్నాయి. ఈ నెల 31 నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.