YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో పీఆర్సీ పంచాయితీ

 ఏపీలో పీఆర్సీ పంచాయితీ

విజయవాడ, జనవరి 29,
ఏపీలో పీఆర్‌సీ వివాదం కొనసాగుతూనే ఉంది. మంత్రుల కమిటీతో చర్చలు జరిపేందుకు ఉద్యోగ సంఘాల నేతలు ముందుకు రాకపోవడంతో అటు మంత్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు ఉద్యోగులు మాత్రం వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు.తాజాగా నేటి నుంచి ఆర్టీసీ కార్మికులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. పీఆర్సీపై ఉద్యోగుల సమ్మెకు ఆర్టీసీ కార్మికులు మద్దతు ప్రకటించారు. ఫిబ్రవరి 3న చేపట్టిన ఛలో విజయవాడకు ఆర్టీసీ కార్మికులు మద్దతు ప్రకటించారు.అటు ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు మంత్రుల కమిటీ ప్రయత్నిస్తున్నా, ఎవరూ రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల పాటు మంత్రుల కమిటీ సమావేశమైనా ఉద్యోగ సంఘాల నేతలు రావడం లేదు. ఇకపై ఎదురు చూపులు ఉండవని, వాళ్లు వస్తేనే చర్చలని స్పష్టం చేసింది మంత్రుల కమిటీ. చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు మంత్రి బొత్స .మరోవైపు ఉద్యోగుల సమ్మె నోటీస్‌ను సవాల్‌ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సమ్మె నోటీసును రాజ్యాంగ, చట్ట విరుద్ధమని ప్రకటించాలని పిటిషన్‌ దాఖలైంది. సుప్రీంకోర్ట్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె సర్వీసు నిబంధనలకు విరుద్ధమని పిటిషన్‌ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. విశాఖకు చెందిన రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఎన్‌ సాంబశివరావు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఇక ఎస్మానేనా...?
ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న పీఆర్సీపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగులు ఆందోళన బాట పట్టడంతో ఎస్మా ప్రయోగించే అంశంపై ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. కీలక శాఖలు కూడా ఉద్యమంలోకి వెళ్తామంటూ స్పష్టం చేయడంతో అలెర్టయింది ప్రభుత్వం. సమ్మె దిశగా అడుగులేస్తోన్న ఆర్టీసీ, విద్యుత్‌, వైద్యారోగ్య శాఖ ఉద్యోగులను ఎలాగైనా దారికి తీసుకురావాలని భావిస్తోంది.ఎస్మా ప్రయోగించే అంశంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. ఏయే శాఖల్లోని ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించవచ్చనే అంశంపై శాఖల వారీగా జాబితాను సిద్దం చేస్తోన్న అధికారులు.అత్యవసరమైతేనే ఎస్మా ఉపయోగించాలని అధికారులకు సూచిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. సమ్మెలను నిషేధిస్తూ ఇటీవలే జీవో జారీ చేసింది విద్యుత్‌ శాఖ.తాము సమ్మెకు వెళ్లడానికి ఆర్టీసీ ఎండీకి ప్రత్యేక నోటీసు అవసరం లేదని.. సీఎస్‌కు పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన నోటీసు చాలంటున్న ఆర్టీసీ ఉద్యోగులు. ఉద్యమ కార్యాచరణ నోటీసును ప్రభుత్వానికి ఇప్పటికే అందచేశారు వైద్య, విద్యుత్‌ శాఖ ఉద్యోగులు. ఓవైపు జీతాలు, పెన్షన్ల బిల్లులు ప్రాసెస్‌కు సహకరించడం లేదు ఉద్యోగులు.4.50 లక్షల బిల్లులకు గానూ.. కేవలం 1.10 లక్షల బిల్లులు మాత్రమే ప్రాసెస్‌ అయ్యాయంటోంది ఆర్థిక శాఖ.పరిస్థితి చేయిదాటకుండా చూసుకునేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఉద్యమం నుంచి వెనక్కు తగ్గేదే లేదంటున్నారు ఉద్యోగులు.

Related Posts