ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. ఈ అప్పులు తెచ్చిన సొమ్మును ఏం చేస్తున్నారంటే.. ఇదిగో అమ్మ ఒడికి ఇచ్చాం.. సంక్షేమానికి ఖర్చు చేస్తున్నాం.. కనిపించడం లేదా? అని మంత్రుల నుంచి నిప్పులు చెరిగే విమర్శలు వస్తున్నాయి. పోనీ.. ఎక్కడ నుంచి అప్పులు తెస్తున్నారు? అంటే.. దీనికి కూడా సరైన సమాధానం లేదు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారంటూ.. విమర్శలు వచ్చినా.. పట్టింపు లేదు. పైగా ఎదురు దాడి లేకుండా.. పోలీసుల దాడి! అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఇదే పరిస్థితి కొనసాగితే.. కష్టమని అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.అంతేకాదు. మేధావులు అయితే.. అసలు ఈ అప్పుల లెక్కలేంటి? వీటిని ఎలా తీరుస్తారు? అనే విస్మయాలు సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ.. సర్కారు మాత్రం నిర్భయంగా.. నిత్యం అప్పు చేసి పప్పు కూడు! అనే తరహాలో చిద్విలాసంగా రోజులు నెట్టుకొస్తోందనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. ఒకవైపు ప్రతిపక్షాలు.. మరోవైపు మేధావులు ఎన్ని సూచనలు చేస్తున్నా.. ఎన్ని విమర్శలు సంధిస్తున్నా.. ఏమాత్రం భేషజం లేకుండా.. సర్కారు తన అప్పుల ముందు చూపును మరింతగా ముందుకు సారిస్తూ.. అందిన కాడికి అప్పు చేస్తూ.. పాలన చేస్తోందిఇక కేవలం 32 నెలల్లో ఏపీ ప్రభుత్వం చేసిన అప్పు ఎక్కువగా ఉందని మేధావులు ఆర్థిక నిపుణులే కాదు.. కేంద్ర ఆర్థిక శాఖ కూడా విమర్శలు చేస్తోంది. 2019లో వైసీపీ అధకారంలోకి రాకముందు అప్పటి వరకు ఉన్న అన్ని ప్రభుత్వాలు(ఉమ్మడి ఏపీ కలిపి) 3.14 లక్షల కోట్ల అప్పులు చేశాయి. వాటిని కూడా ఆచి తూచి ఖర్చు చేశాయి. అంతేకాదు.. ఏ అప్పు దేనికి చేశామో కూడా చెప్పుకొచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం 32 నెల్లలో 3.64 లక్షల కోట్ల అప్పులు చేసింది. అయితే.. ఈ సొమ్మును ఏం చేశారు? అంటే.. మాత్రం పెదవి విరుపులే కనిపిస్తున్నాయి. ఎటువంటి అభివృద్ది కనిపించడం లేదు. సో.. ఇదీ పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఏపీ ఎక్కడెక్కడ నుంచి ఇంత అప్పులు తెచ్చిందనే విషయం ఆసక్తిగా మారింది. ఆ వివరాలు ఇవీ..
సంస్థ అప్పు తెచ్చిన మొత్తం(కోట్లలో)
ఎస్డీఎల్స్ 229317.60
ఉదయ్ 8256.00
కాంపెన్సేషన్ బాండ్లు 1500.10
ఎన్ ఎస్ ఎస్ ఎఫ్ 10158.40
ఎల్ ఐసీ నుంచి రుణం 41.90
జీఐసీ నుంచి రుణం 16.00
నాబార్డు 6800.40
ఎన్సీడీసీ రుణం 99.40
ఇతర సంస్థల నుంచి 101.30
కేంద్రం నుంచి రుణం 21711.80
పీఎఫ్ 22878.00
రిజర్వ్ ఫండ్ 3140.20
డిపాజిట్ అడ్వాన్సులు 62745.40
కంటింజెన్సీ ఫండ్ 50.00
---------------------------------------------------------
మొత్తం 360333.40 లక్షల కోట్లు
=============================