ముంబై, జనవరి 31,
పణి వ్యవస్థతో పాటు ఆయుధాల కొనుగోలుకు ఉద్దేశించిన రెండు వందలక కోట్ల డాలర్ల డిఫెన్స్ ప్యాకేజీలో భాగంగా 2017లో భారత ప్రభుత్వం ఇజ్రాయెలీ స్పైవేర్ పెగాసస్‌ను కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ సంచలానత్మక కథనం ప్రచురించింది. ‘ ద బాటిల్ ఫర్ ద వరల్డ్ మోస్ట్ పవర్‌ఫుల్ సైబర్ వెపన్’ పేరుతో ఈ కథనం వెలువడింది. దాంతో భారత్‌లో మరోసారి పెగాసిస్ అంశం ప్రధాన వార్తగా మారింది.అత్యాధునిక ఆయుధాలు, నిఘా పరికరాల కొనుగోలుకు భారత్, ఇజ్రాయేల్ మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంలో భాగంగా క్షిపణులతోపాటు పెగాసస్ స్పైవేర్ భాగమేనని న్యూయార్క్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. పెగాసస్ వ్యవహారంపై దాదాపు ఏడాది పాటు పరిశోధన జరిపి ఈ నివేదిక రూపొందించినట్లు పత్రిక వెల్లడించింది.ఎన్‌ఎస్ఓ సంస్థకు చెందిన పెగాసస్ స్పైవేర్ సాయంతో భారత్ సహా పలు దేశాల్లో జర్నలిస్ట్‌లు, మానవహక్కుల కార్యకర్తలు, ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాక్ చేసినట్టు బయటకు రావడంతో వివాదం చెలరేగింది.2017 జులై లో ప్రధాని మోడీ ఇజ్రాయిల్ పర్యటనలో ఈ ఒప్పందం జరిగినట్లు వెల్లడించింది. ఆ సమయంలోనే రెండు వందల కోట్ల డాలర్ల పెగాసెస్ స్పైవేర్‌తో పాటు క్షిపణి వ్యవస్థ కొనుగోలు ఒప్పందం జరిగినట్లు చెబుతోంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ని సందర్శించిన భారత ప్రధాని మోడీ ఒక్కరే. అప్పటి వరకు పాలస్తీనాకు కట్టుబడి ఉన్నఇండియా మోడీ పర్యటనతో ఇజ్రాయిల్ వైపు మొగ్గింది. న్యూయార్క్ కథనంపై ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన రాలేదు.అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఈ స్పైవేర్‌ను కొనుగోలు చేసి పరీక్షించిందని సంవత్సరం పాటు జరిపిన పరిశోధనలో తమకు తెలిసిందని పత్రిక పేర్కొంది. సంవత్సరాల పాటు దేశీయ నిఘా కోసం ఈ స్పైవేర్‌ని వాడుకోవాలనే ఉద్దేశంతో దీనిని కొనుగోలు చేసిందని , అయితే ఎందుకో దీనిని ప్రయోగించకూడదని గత సంవత్సరం ఎఫ్‌బీఐ నిర్ణయించిందని తాజా కథనం అంటోంది.మరోవైపు,భారత్‌లోని పలువురు ప్రముఖలపై ఇజ్రాయిల్ స్పైవేర్‌ను వినియోగించి కేంద్రం నిఘా పెట్టినట్లు అంతర్జాతీయ పరిశోధనాత్మక కన్సార్టియం బయటపెట్టడంతో మోడీ సర్కార్ ఇరుకున పడింది.ఈ ఆరోపణలను ప్రభుత్వం తేలిగ్గా తీసిపారేసింది.కానీచ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా అన్నివిపక్షాలు పెగాసిస్ అంశంపై పార్లమెంట్‌లో హోం మంత్రి వివరణకు పట్టుబట్టాయి. కానీ అధికార పక్షం ససేమిరా అనటంతో ఉభయసభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఓ సెషన్ మొత్తం పెగాసిస్‌తో తుడిచి పెట్టుకుపోయింది. చివరకు గత అక్టోబర్‌లో ఈ సమస్య సుప్రీంకోర్టు మెట్లెక్కింది. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. పెగాసస్‌ను వినియోగించారా లేదా నిగ్గు తేల్చేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ పరిశోధనాత్మక కథనంతో ఈ వివాదాస్పద అంశం మరోసారి తెరమీదకు వచ్చినట్టయింది. మరి కొద్ది రోజులలో యూపీ , పంజాబ్ సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నందున అధికార బీజేపీని ఇది ఇరుకున పెట్టే అంశం. ముఖ్యంగా బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన యూపీ ఎన్నికల్లో దాని ప్రధాన ప్రత్యర్ధి సమాజ్ వాదీ పార్టీ దీనిని ఎంతవరకు ఉపయోగించుకుంటుందో చూడాలి. ఐతే పెగాసిస్ అంశం సామాన్య ప్రజలకు అర్థమయ్యే అంశం కాదు కాబట్టి అధికార పార్టీకి పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు. కానీ, టీవీ చర్చల్లో , సామాజిక మాధ్యమాల్లో ప్రతిపక్షాలు దీనిపై నానా యాగీ చేసే అవకాశం మాత్రం ఉంది.న్యూయార్క్ టైమ్స్ కథన వెలువడిన వెంటనే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ స్పందించింది. ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా కేంద్రంపై విరుచుకుపడ్డారు. వివిధ రాష్ట్రాలలో నేతలు, ప్రజలపై నిఘా పెట్టేందుకు మోదీ ప్రభుత్వం పెగాసస్‌ను కొనుగోలు చేసిందని, ప్రతిపక్షం, న్యాయస్థానాల్ని టార్గెట్ చేసి వారి ఫోన్ ట్యాప్ చేసిందని రాహుల్ విమర్శించారు. ఇది దేశద్రోహం అని, మోదీ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందని రాహుల్ ట్వీట్ చేశారు.మోడీ సర్కార్ భారత్‌కు శత్రువుల్లా ప్రవర్తించి భారత పౌరులపై యుద్ధ ఆయుధాన్ని ఎందుకు ప్రయోగించిందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ట్విటర్ వేదికగా నిలదీశారు.రాహుల్ గాంధీతో పాటు దేశ పౌరులపై నిఘా పెట్టడానికి బిజెపి ప్రభుత్వం మిలిటరీ స్పైవేర్‌ను ఉపయోగించిందనడానికి ఇది తిరుగులేని రుజువని ఆ పార్టీ నేత షామా మహ్మద్ అన్నారు. న్యూయార్క్ టైమ్స్ నివేదికలో బహిర్గతమైన అంశాలు సుప్రీంకోర్టును, పార్లమెంటును కేంద్రం తప్పుదోవ పట్టించినట్లు నిర్ధారిస్తున్నాయని, రాజ్యసభ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత శక్తిసిన్హ్ గోహిల్ ఆరోపించారు.ప్రపంచవ్యాప్తంగా దీనిని ఎవరెవరు ఎలా ఉపయోగించారో న్యూయార్క్ టైమ్స్ కథనం బట్టబయలు చేసింది. జర్నలిస్టులు, అసమ్మతి వాదులు లక్ష్యంగా మెక్సికో , మహిళల హక్కుల కార్యకర్తలు, హత్యకు గురైన కాలమిస్ట్ జమాల్ ఖషోగ్గి సహచరులకు వ్యతిరేకంగా సౌదీ అరేబియా స్పైవేర్ కొనుగోలు చేసినట్టు తేలింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ లైసెన్స్ పొందిన కొత్త ఒప్పందాల సెట్ ప్రకారం, పెగాసస్ పోలాండ్, హంగేరి, భారత్ఇ తో పాటు పలు ఇతర దేశాలకు అందిందని పత్రిక పేర్కొంది. న్యూయార్క్ టైమ్స్ కథనంతో భారత్‌లో పెగాసిస్ కథ ఏ మలుపు తిరుగుతుందో చూద్దాం..!