YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

జూనియర్ కళాశాలలకు అఫిలియేషన్ తప్పనిసరి

జూనియర్ కళాశాలలకు అఫిలియేషన్ తప్పనిసరి

నల్గొండ, జనవరి 31,
ఈ విద్యా సంవత్సరం నుంచి జూనియర్ కళాశాలలకు అఫిలియేషన్ తప్పనిసరి చేస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అనుమతి లేకుండా గతంలో కొన్ని యాజమాన్యాలు కళాశాలలను ఏర్పాటు చేసుకున్నాయి. వీటన్నింటినీ కట్టడి చేసేందుకు ఈ విడుత నిబంధలన్నింటినీ పక్కాగా పాటించే కళాశాలల యాజమాన్యాలకే అఫిలియేషన్ ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. అఫిలియేషన్ ఉంటేనే విద్యార్థులకు ప్రవేశం కల్పించాలి. లేకుంటే పరీక్షల నిర్వహణ బోర్డు నుంచి అనుమతి ఉండదు. ఈనెల 11వరకు దరఖాస్తు గడువు ఉండగా.. కొన్ని కళాశాలల యాజమాన్యాల సూచనల మేరకు ఆ గడువును  పొడిగించారు. జూనియర్ కళాశాలలు ముందస్తు అనుమతి గుర్తిం పు తీసుకోవడం ద్వారా కళాశాల పేరు మంజూరైన కోర్సుల వివరాలు విద్యార్థులకు స్పష్టంగా తెలుస్తాయి. గుర్తింపులేని కళాశాలలు లేకపోవడంతో విద్యార్థులు నష్టపోయే అవకాశం లేదు. ఫలితంగా విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఉం టుంది. ప్రభుత్వం అందించే ఉపకార వేతనాల వివరాలు ముందుగానే తెలుస్తుండడంతో బడ్జెట్ కేటాయించేందుకు ప్ర భుత్వానికి వెసులుబాటు ఉంటుంది. గుర్తింపు లేని కళాశాలలో చేరిన విద్యార్థుల కు ఉపకార వేతనాలు రాక, సర్టిఫికెట్లు అందక ఉ న్నత విద్యలో చేరేందుకు అడ్డంకులు ఏర్పడతాయి. సూర్యాపేట జిల్లాలో మొత్తం 75కళాశాలలు ఉండగా.. అందులో 7 ప్రభుత్వ కళాశాలలు, 9మోడల్ స్కూల్ కళాశాలలు, 4సాంఘిక సంక్షేమ కళాశాలలు, 1గిరిజన సంక్షేమ కళాశాలతోపాటు 1ఎయిడెడ్ కళాశాల, 53 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో మొత్తం 107కళాశాలలు ఉండగా.. అందులో 64ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ఇప్పటివరకు సూర్యాపేట జిల్లాలో నూతనంగా అనుబంధ గుర్తింపునకు ఆరు కళాశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. విజ్ఞాన్ జూనియర్ కళాశాల(హుజూర్‌నగర్), వాగ్దేవి(కోదాడ), రాజారాం(సూర్యాపేట), ఎంకేఆర్(సూర్యాపేట), గౌతమి(సూర్యాపేట), సాంఘిక సంక్షేమ గురుకుల(సూర్యాపేట). ఇక నల్లగొండ జిల్లాలో నూతన కళాశాలల ఏర్పాటుకు 21దరఖాస్తులు వచ్చాయి. కళాశాలల్లో మౌలిక వసతులు, పారిశుధ్యం, సౌండ్ సిస్టం, ఫైర్‌సేప్టీ, ప్రయోగశాలలు, అర్హత కలిగిన బోధన సిబ్బంది, పాత గుర్తింపు పత్రం, క్రీడా మైదానం, సెల్ప్ డిక్లరేషన్, కళాశాల లీజు డీడ్, సేల్ డీడ్, ఎఫ్‌డీఆర్, కళాశాల పూర్తి చిరునామా వివరాలు, సిబ్బంది ఒరిజినల్ సర్టిఫికెట్లు, కళాశాల ఫొటో, పార్కింగ్ స్థలం, ఫర్నిచర్, కంప్యూటర్ గది తదితర నిబంధనలు పాటించిన కళాశాలకు మాత్రమే బోర్డు అనుమతి గుర్తింపు జారీ చేస్తుంది. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా దరఖాస్తును తిరస్కరిస్తుంది. దీంతో కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఆయా సర్టిఫికెట్ల కోసం ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. వీటన్నింటినీ క్రోడీకరిస్తూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ధ్రువపత్రాలను, డాక్యుమెంట్లను ఇంటర్ బోర్డు అధికారులు ప్రత్యక్షంగా పరిశీలన చేస్తారు. ఆ తరువాత మాత్రమే అనుమతి గుర్తింపు ఇస్తారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకుంటే అనుమతి వస్తుందని, లేని పక్షంలో కళాశాలలపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు

Related Posts