YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

మాముళ్ల మత్తులో అధికారులు

మాముళ్ల మత్తులో అధికారులు

హైదరాబాద్, జనవరి 31,
క‌న్ను ప్రభుత్వ భూముల‌పై ప‌డింది. నిషేదిత జాబితాలో ఉన్నాయ‌ని తెలిసినా త‌క్కువ ధ‌ర‌కు కొనుగోలు చేసి.. వాటిలో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా బ‌హుళ అంత‌స్తులు నిర్మిస్తూ కోట్లాది రూపాయ‌లు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూములు నిషేదిత జాబితాలో ఉండ‌డంతో వీటి రిజిస్ట్రేష‌న్లను ప్రభుత్వం నిలిపి వేసింది. అయినా ఎటువంటి అనుమ‌తులు లేకుండానే నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా బ‌హుళ అంత‌స్తులు నిర్మించ‌డం విస్మయానికి గురిచేస్తుంది. ఎటువంటి ప‌ర్మిష‌న్లు లేక‌పోయినా య‌ధేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేప‌డుతుండ‌డంతో జీహెచ్ఎంసీ యంత్రాగం మామూళ్ల మ‌త్తులో జోగుతుంద‌నే విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూముల‌ను కాపాడాల్సిన రెవెన్యూ అధికారుల అల‌స‌త్వం అక్రమార్కుల‌కు కాసుల పంట పండిస్తుంది.రంగారెడ్డి జిల్లా హ‌య‌త్‌న‌గ‌ర్ మండ‌ల ప‌రిధిలోని అన్మగ‌ల్‌ హ‌య‌త్‌న‌గ‌ర్ గ్రామ‌ స‌ర్వేనంబ‌ర్ 60/1లో 37 ఎక‌రాల 37 గుంట‌లు, 60/1/1 లో 12 ఎక‌రాల 23 గుంట‌లు, 60/2 లో 54 ఎక‌రాల 10 గుంట‌లు మొత్తం 104 ఎక‌రాల 30 గుంట‌ల ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవెన్యూ అధికారుల అల‌స‌త్వంతో భూ మాఫియా య‌ధేచ్చగా క‌బ్జా చేసి హ‌య‌త్‌న‌గ‌ర్‌లో ఆర్టీసీ కాల‌నీ పేరుతో వెంచ‌ర్ చేసి విక్రయాలు చేసింది. ఈ భూ బాగోతంలో వేల కోట్ల రూపాయ‌లు చేతులు మారాయ‌ని స‌మాచారం. ఇందులో రెవెన్యూ అధికారుల‌తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధుల‌కు పెద్ద మొత్తంలో ముడుపులు అందిన‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ భూములు నిషేదిత జాబితాలో ఉన్నాయి. అయినా రెవెన్యూ అధికారులు అటువైపు క‌న్నెత్తి చూడ‌ర‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. వేల కోట్ల రూపాయ‌ల విలువ చేసే ప్రభుత్వ భూముల‌ను కాపాడాల్సిన రెవెన్యూ యంత్రాంగం మామూళ్ల మ‌త్తులో జోగుతోంద‌నే విమ‌ర్శలు వినిపిస్తున్నాయి.
/1/1, 60/2 లోని మొత్తం 104 ఎక‌రాల 30 గుంట‌ల భూమి నిషేదిత జాబితాలో ఉంది. దీంతో ఈ భూముల్లోని ప్లాట్ల క్రయ‌, విక్రయాల‌ను, రిజిస్ట్రేష‌న్లను ప్రభుత్వం పూర్తిగా నిలిపి వేసింది. గ‌తంలో ఈ భూముల‌ను రియ‌ల్ మాఫీయా క‌బ్జా చేసి వెంచ‌ర్లు చేసింది. అధికారుల‌కు ముడుపులు చెల్లించి కొంత మేర‌కు రిజిస్ట్రేష‌న్లు కూడా చేసింది. అయితే ప్రభుత్వ ధ‌ర‌ణి పోర్టల్ రావ‌డంతో ఈ భూములు ప్రభుత్వ నిషేదిత జాబితాలోకి వెళ్లాయి. అప్పటి నుంచి ఈ స‌ర్వేనంబ‌ర్‌లోని భూములు రిజిస్ట్రేష‌న్లు జ‌ర‌గ‌డంలేదు. దీంతో బిల్డర్ల క‌న్ను ఈ భూముల‌పై ప‌డింది. రిజిస్ట్రేష‌న్లు కాక‌పోవ‌డంతో ప్లాట్లు కొనుగోలు చేసిన య‌జ‌మాల‌ు ఎంత‌కో అంత‌కు బిల్డర్లకు అమ్ముకుంటున్నారు. ఇదే అదునుగా బిల్డర్లు య‌ధేచ్ఛగా బ‌హుళ అంత‌స్తుల‌ అక్రమ నిర్మాణాలు చేప‌డుతూ కోట్లాది రూపాయ‌లు దండుకుంటున్నారుజీహెచ్ఎంసీ స‌ర్కిల్‌-3 అధికారులు మామూళ్ల మ‌త్తులో జోగుతున్నార‌నే విమ‌ర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. నిషేదిత భూముల్లో రిజిస్ట్రేష‌న్లు లేకున్నా బ‌హుళ అంత‌స్తుల నిర్మాణాలు ఎలా జ‌రుగుతున్నాయ‌ని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మామూలు ఇంటి నిర్మాణానికి స‌వాల‌క్ష నిబంధ‌న‌లు గుర్తుకు వ‌చ్చే జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఇంత పెద్ద నిర్మాణాలు క‌నిపించ‌క‌పోవ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తుందంటున్నారు. ఎటువంటి అనుమ‌తులు లేకుండా ఐదు, ఆరు అంత‌స్తులు నిర్మిస్తున్నా జీహెచ్ఎంసీ అధికారులు ఎందుకు ప‌ట్టన‌ట్లు వ్యవ‌హ‌రిస్తున్నార‌ని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్డర్ల ద‌గ్గర ల‌క్షలాది రూపాయ‌ల వ‌సూళ్లకు పాల్పడి క‌నీసం అటువైపు క‌న్నెత్తి కూడా చూడ‌డంలేద‌ని వాపోతున్నారు. చిన్నపాటి ఇంటి నిర్మాణం చేప‌డితే కూల్చివేత‌ల‌కు పాల్పడే జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారుల‌కు ఇంత పెద్ద అక్రమ నిర్మాణాలు క‌నిపించ‌క‌పోవ‌డం హాస్యాస్పదంగా ఉందంటున్నారు. ఇప్పటికైనా అధికారులు అక్రమ బ‌హుళ అంత‌స్తులు నిర్మిస్తున్న బిల్డర్లపై చ‌ట్టప‌ర‌మైన చ‌ర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Related Posts