గుంతకల్లు
తెలుగుదేశం పార్టీ రాష్ట్రoలో తలపెట్టిన నారీ దీక్షకు విజయవాడకు ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలులో వెళ్తున్న అనంతపురం మాజీ మేయర్ మదమంచి స్వరూప ను గుంతకల్లు ఒకటవ పట్టణ పోలీసులు రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారు. ఆమెను అడుగడుగునా అడ్డ గించిన పోలీసులు ఎట్టకేలకు గుంతకల్లు రైల్వే స్టేషన్లో రైళ్లో నుంచి బలవంతంగా ఆమెను కిందకు దింపారు. అనంతరం ఆమెను ప్లాట్ ఫామ్ కి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మీడియా తో మాట్లాడుతూ మహిళలకు వైసీపీ ప్రభుత్వం లో రక్షణ కరువైందని చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ రక్షణ లేదన్నారు. విజయవాడలో చిన్నారిపై జరిగిన అత్యాచారానికి మహిళలు గళం విప్పకుండా పోలీసులు అడ్డుకోవడం చాలా దారుణంగా ఉందన్నారు. మహిళలపై అత్యాచారాలు దాడులకు నిరసనగా నారీ దీక్షను అడ్డుకోవడానికి పోలీసులు సహకరించక పోవడం అన్యాయం అన్నారు. దాదాపు గంట పాటు గుంతకల్లు రైల్వే స్టేషన్ లో ఏమి జరగబోతుందో తెలియక ఆందోళనకు గురైన ప్రయాణికులు విజయవాడ వెళ్తున్న మరి కొంత మందిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అనుచిత తీరుపై మదమంచి స్వరూప అభ్యంతరం వ్యక్తం చేశారు. గుంతకల్లు కు చెందిన టీడీపీ నాయకులు రైల్వే స్టేషన్ కు వచ్చి ఆమెను పరామర్శించారు.