అనంతపురం
పంచాయతీ ఈవో వేధింపులు తాళలేక బిల్ కలెక్టర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కనేకల్ గ్రామ పంచాయతీలో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా కనేకల్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జరుగుతున్న సమయంలో బిల్ కలెక్టర్ ఇబ్రహీం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈవో తరచూ వేధించడం వల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. బిల్ కలెక్టర్ ఇబ్రహీం కు వ్యతిరేకంగా సి ఈ ఓ కు పంచాయతీ సెక్రెటరీ చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారని దీంతో సీఈవో అతని కార్యాలయానికి పిలిపించి మందలించాడు. ఇబ్రహీం గత 25 సంవత్సరాలుగా పంచాయతీ కార్యాలయంలో బిల్ కలెక్టర్ గా పని చేస్తున్నాడు.ప్రొబేషన్ డిక్లరేషన్ అయ్యింది. కానీ అధికారులు సర్వీస్ రికార్డులో నమోదు చేయలేదు. అధికారులు ఏదో ఒక సాకుతో తనను వేధిస్తున్నారని మనస్తాపం చెంది పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తనపై అధికారులు లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇక్కడి నుంచి బదిలీ చేయాలని ఈవో రాజకీయ నాయకులు చూస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నారు