సిద్దిపేట
సిద్దిపేట అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు గన్ కాల్పులు కలకలం రేపాయి. కాల్పులు జరిపినదుండగులు 42 లక్షల 50 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఘటనలో కారు డ్రైవర్ కు గాయలు అయ్యాయి. క్షతగాత్రుడిన ఆసుపత్రికి తరలించారు. భూమి రిజిస్ట్రేషన్ చేయించాడనికి ఒక వ్యక్తి నగదు తో సహ కారులో వచ్చాడు. కారు దిగి ఆఫీసుకు వెళ్ళగానే, దుండగులు కార్ డ్రైవర్ పైన గన్ తో కాల్పులు జరిపి, అద్దాలు పగలు గొట్టి కారు లో ఉన్న 42 లక్షలు తీసుకున్నార. కాల్పులు జరిపిన దుండగులు బైకు పై వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.