YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హ‌లీమ్ త‌యారీలో నాణ్య‌త ప్ర‌మాణాలు పాటించాలి :మేయ‌ర్

హ‌లీమ్ త‌యారీలో నాణ్య‌త ప్ర‌మాణాలు పాటించాలి :మేయ‌ర్

హైద‌రాబాద్‌లో త‌యారుచేసే హ‌లీంకు ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి ఉంద‌ని, ఈ హ‌లీమ్ త‌యారీలో నాణ్య‌త ప్ర‌మాణాలు పాటించ‌డంతో పాటు హ‌లీం త‌యారీ, విక్ర‌యాలలో పాల్గొనే సిబ్బంది వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌తో ఉండేవిధంగా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, హ‌లీం త‌యారీదారుల య‌జ‌మానుల‌ను న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ కోరారు.   ఈ నెల‌లో రానున్న రంజాన్ మాసం సంద‌ర్భంగా ఏర్పాటు కానున్న హ‌లీమ్ త‌యారీదారుల‌ య‌జ‌మానుల‌తో నేడు జీహెచ్ఎంసీలో ప్ర‌త్యేక స‌మావేశాన్ని నిర్ణ‌యించారు. డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్‌, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు శృతిఓజా, సిగ్దాప‌ట్నాయ‌క్‌, ర‌వికిర‌న్‌ల‌తో పాటు  న‌గ‌రంలోని ప‌లు ప్ర‌ముఖ హ‌లీం త‌యారీదారులు, హోట‌ళ్ల య‌జ‌మానుల సంఘం, జీహెచ్ఎంసీ మెడిక‌ల్, వెట‌ర్న‌రీ అధికారులు ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మేయ‌ర్ రామ్మోహ‌న్‌ మాట్లాడుతూ రంజాన్ మాసం ప్రారంభానికి ముందే హోట‌ల్ నిర్వాహ‌కులు, వారి సిబ్బందికి ప్ర‌త్యేక శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేయాల‌ని హోట‌ళ్ల య‌జ‌మానుల సంఘానికి మేయ‌ర్‌ సూచించారు. వ్య‌క్తిగ‌త, ప‌రిస‌రాల‌ ప‌రిశుభ్ర‌త పాటించ‌డంతో పాటు తాము పాటించే అంశాల‌న్నింటినీ తెలిపే ప్ర‌త్యేక చార్ట్‌ను ప్ర‌తిహోట‌ల్‌లో ప్ర‌ద‌ర్శించాల‌ని సూచించారు. రంజాన్ సంద‌ర్భంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 1500 నుండి 2000 హ‌లీం బ‌ట్టీలు ఏర్పాటు అయ్యే అవ‌కాశం ఉంద‌ని, వీటిని కేవ‌లం గ్రౌండ్ ఫ్లోర్‌లో మాత్ర‌మే ఏర్పాటు చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ హ‌లీం త‌యారీకి ఉప‌యోగించే మాంసాన్ని త‌ప్ప‌నిస‌రిగా జీహెచ్ఎంసీ నిర్వ‌హించే క‌బేళాల నుండి మాత్ర‌మే తేవాల‌ని, అన‌ధికార క‌బేళాల నుండి మాంసాన్ని తేవొద్ద‌ని అన్నారు. మాంసంతో పాటు బీఫ్‌, చికెన్‌, ఏము, చేప‌ల కొనుగోలును అధికార ధృవీక‌ర‌ణ కేంద్రాల నుండే చేప‌ట్టాల‌ని సూచించారు. హైద‌రాబాద్‌లో త‌యారయ్యే హ‌లీం  విదేశీ న‌గ‌రాల‌కు కూడా ఎగుమ‌తి అవుతుంద‌ని, ఈ హ‌లీం నాణ్య‌త ప్ర‌మాణాల‌ను కాపాడేందుకు ఉన్న‌త ప్ర‌మాణాల‌తో కూడిన దినుసుల‌ను వాడాల‌ని కోరారు. ప్ర‌తిరోజు వంద కిలోల‌కు పైగా వ్య‌ర్థాల‌ను ఉత్ప‌త్తిచేసే హోట‌ళ్లు త‌ప్ప‌నిస‌రిగా కంపోస్ట్‌పిట్‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు. హైద‌రాబాద్ న‌గ‌రం ప్ర‌పంచంలోనే ఉత్త‌మ నివాస‌యోగ్య‌మైన న‌గ‌రంగా ఉంద‌ని, దీనిని కొన‌సాగించేందుకు హ‌లీమ్ త‌యారీ య‌జ‌మానులు స‌హ‌క‌రించాల‌ని డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్ కోరారు. ఈ స‌మావేశంలో చీఫ్ వెట‌ర్న‌రీ ఆఫీస‌ర్ వెంక‌టేశ్వ‌ర్‌రెడ్డి న‌గ‌రంలోని ప‌లు హోట‌ళ్ల య‌జ‌మానులు పాల్గొన్నారు.

Related Posts