న్యూఢిల్లీ, జనవరి 31,
మంగళవారం కేంద్రం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ 2022-23 బడ్జెట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అటు కరోనా ప్రతికూల పరిస్థితులు, ఇటు ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యలో కేంద్రం ఎలాంటి ప్రకటన చేయనుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక సోమవారం నుంచి పార్లమెంట్ సమాశాలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింగ్ ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాలు సహకరించాలని మోడీ కోరారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎంపీలందరికి స్వాగతం పలుకుతున్నానని అన్నారు. దేశాభివృద్దికి కీలక సమయమని, ప్రపంచ ఆర్థిక పరిస్థితిలో భారత్‌కు చాలా అవకాశాలున్నాయని అన్నారు. మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్లు ప్రపంచానికి విశ్వాసాన్ని కలిగిస్తుందని,చర్చలకు విపక్షాలు సహకరిస్తాయని ఆశిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు.అయితే ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేపర్‌లెస్ యూనియన్ బడ్జెట్ 2022-23 ప్రవేశ పెడుతారు. ఇంతకుముందు, 2021-22లో మొదటిసారి పేపర్‌లెస్ యూనియన్ బడ్జెట్‌ను సమర్పించారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈసారి ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది.