YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పార్టీ నుంచి పంపించే కుట్ర : వీహెచ్

పార్టీ నుంచి పంపించే కుట్ర : వీహెచ్

హైదరాబాద్, జనవరి 31,
తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అధికార పక్షంతో పోరాడటం పక్కన ఉంచితే స్వపక్షంలో విపక్షాలు తయారవుతున్నాయి. తాజాగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి. హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇటీవల తనకు అవమానం జరిగిందని.. తనను అవమానపరిచిన మంచిర్యాల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రేమ్ సాగర్ రావుకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని పట్టుబట్టాడు. ప్రస్తుతం ఈ షోకాజ్ నోటిసే కాంగ్రెస్ పార్టీలో రచ్చకు కారణం అవుతోంది. ప్రేమ్ సాగర్ రావుకు ఇచ్చిన షోకాజ్ నోటీసులో ఏమీ లేదంటూ.. వీహెచ్ విమర్శిస్తున్నారు. మంచిర్యాలలో మాకు అవమానం జరిగితే పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదంటూ మండిపడ్డారు.పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం వెంటనే నిర్వహించాలని వీహెచ్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రేమ్ సాగర్ రావుపై పార్టీ వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ డిమాండ్ చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల కోసం వెళ్తే అవమానించారని విమర్శించారు. అయితే రేవంత్‌ రెడ్డి పీసీసీ చీఫ్‌ అయినప్పటి నుంచి సీనియర్‌ కాంగ్రెస్ నాయకులు గుర్రుగా ఉన్నారు. గతంలో జగ్గారెడ్డి సైతం రేవంత్‌ రెడ్డిని ప్రశ్నిస్తూ .. అన్ని తనకు చెప్పి చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. దీంతో కాంగ్రెస్‌లో నిత్యం ఏదో మూలన అసంతృప్తి జ్వాలలు రగులుతునే ఉన్నాయి. పైకి పార్టీలో ఎలాంటి విబేధాలు లేవని చెప్పిన అప్పుడప్పుడు ఈ విబేధాలు ఒక్కసారిగా గుప్పుమంటున్నాయి.

Related Posts