YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఢమాల్..ఢమాల్ అంటున్న టమాటా

ఢమాల్..ఢమాల్ అంటున్న టమాటా

కర్నూలు, ఫిబ్రవరి 1,
గత కొన్ని రోజుల క్రితం వరకూ టమాటా ధర చుక్కలను తాకింది. గత ఏడాది చివరిలో ఆంధ్ర ప్రదేశ్ లో కురుసిన వర్షాలతో టమాటా ధర ఆల్ టైం హై కు చేరుకుంది. రైతులకు లాభాలను.. సామాన్యులకు కంట కన్నీరు పెట్టించాయి. అయితే ఇప్పుడు టమాటా ధరలు అకస్మాత్తుగా నేలచూపులు చూస్తున్నాయి. నిన్నా మొన్నటి వరకూ కిలో రూ. 30 నుంచి రూ. 40ల వరకూ పలికిన టమాటా ధర.. నేడు కిలో ఐదు రూపాయలు అన్నా కొనేవారు లేరు.కర్నూలు జిల్లాలో టమోటా ధరలు చిత్రవిచిత్రంగా పలుకుతున్నాయి. మార్కెట్లో ప్రతిరోజు హెచ్చుతగ్గులు ఉండటంతో ఎప్పుడు ధర ఉంటుందో ఎప్పుడు తగ్గుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నిన్న మొన్నటి వరకూ టమాటా ధర సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. కిలో టమాటా ధర 150 నుంచి 200రూపాయలు పలికిన సందర్భం కూడా ఉంది. టమాటా దిగుబడి ఒక్కసారిగా తగ్గిపోవడంతో ధర అమాంతం పెరిగిపోయింది. టమాటా ధర ఇప్పుడిప్పుడే దిగి వస్తుంది. మొన్నటి వరకూ కిలో నలభై రూపాయలు పలికిన టమాటా రెండు మూడు రోజుల నుంచి ఇరవై రూపాయలకు చేరుకుంది. తాజాగా కర్నూలు ఆస్పరి మార్కెట్ లో అయితే కిలో టామాటా ఐదు రూపాయలే పలికింది. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. మొన్నటి వరకూ ఇదే మార్కెట్ లో వంద రూపాయలు పలికిన టమాటా నేడు ఐదు రూపాయలకు చేరుకోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తమకు గిట్టుబాటు కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Posts