న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1,
హోటల్ ను ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది నుంచే టూరిస్టులను అంతరిక్షానికి తీసుకెళతామని నాసా గతంలో ప్రకటించింది. కానీ పలు కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. తాజాగా అంతరిక్షంలో తొలిహోటల్ ను కట్టేందుకు ‘యాక్సియెమ్ స్పేస్’ అనే ప్రైవేట్ కంపెనీని నాసా సెలక్ట్ చేసింది. ‘యాక్సియెమ్ సెగ్మెంట్’ అనే ఈ స్పేస్ హోటల్ నిర్మాణాన్ని 2024లో ప్రారంభించనున్నట్లు ఆ కంపెనీ తన వెబ్ సైట్ లో ఇటీవల ప్రకటించింది.స్పేస్ హోటల్ నిర్మాణం కోసం దశలవారీగా మాడ్యూల్స్, కావాల్సిన పరికరాలను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు తరలిస్తారు. ఆ తర్వాత ఐఎస్ఎస్ కు ఒక్కో భాగాన్ని జోడించి, హోటల్ నిర్మాణం పూర్తి చేస్తారు. యాక్సియెమ్ సెగ్మెంట్ లో మూడు మాడ్యూల్స్ ఉంటాయి. వాటిలో ఒకటి టూరిస్టులు ఉండేందుకు, మరొకటి సిబ్బంది ఉండేందుకు, ఇంకొకటి రీసెర్చ్, మానుఫాక్చరింగ్ ఫెసిలిటీగా ఉంటుంది. దీనికి కింది భాగంలో భారీ అద్దాల గది అమరుస్తారు. టూరిస్టులు అందులోకి వెళ్లి 360 డిగ్రీల కోణంలో భూమిని, అంతరిక్షాన్ని చూడొచ్చు. స్పేస్ హోటల్ లో టూరిస్టులకు హాని కలగకుండా ఉండేందుకు గోడలన్నీ ప్యాడింగ్ (మెత్తని పదార్థాన్ని ప్యాడ్లుగా అమరుస్తారు) చేస్తారు. ఎల్ఈడీ లైట్లు, సూపర్ ఫాస్ట్ వైఫై, పెద్ద వీడియో స్క్రీన్లు కూడా ఉంటాయి. అంతా రెడీ అయ్యాక ఏడాదికి రెండు నుంచి మూడు ట్రిప్పులు టూరిస్టులను తీసుకెళ్తారని చెప్తున్నారు.ప్రస్తుతం భూమి చుట్టూ లో ఎర్త్ ఆర్బిట్ లో తిరుగుతున్న ఐఎస్ఎస్ 400 కిలోమీటర్లకు అటూ, ఇటూగా అవసరాన్ని బట్టి ఎత్తును సవరించుకుంటూ తిరుగుతోంది. అయితే, ఐఎస్ఎస్ మరో పదేళ్ల తర్వాత ఆస్ట్రోనాట్లు ఉండేందుకు పనికిరాదని, అప్పుడు దానిని వదిలేయక తప్పదని అంటున్నారు. ఆ సమయం వచ్చినప్పుడు ఐఎస్ఎస్ నుంచి స్పేస్ హోటల్ ను విడదీస్తామని నాసా వెల్లడించింది. దీనిని అప్పుడు మరో స్పేస్ స్టేషన్ గా మార్చుకుని అటు టూరిజానికి, ఇటు స్పేస్ రీసెర్చ్ కూ వాడుకుంటామని చెప్తోంది. అంతేకాదు.. లో ఎర్త్ ఆర్బిట్ చివరిదాకా అంటే.. భూమికి 2 వేల కిలోమీటర్ల ఎత్తువరకూ దీనిలో టూరిస్టులను తీసుకెళ్తామని అంటోంది. అన్నీ సవ్యంగా జరిగి ఈ స్పేస్ టూర్లు మొదలైతే.. ఇక మనం కూడా గంటకు 27,600 కిలోమీటర్ల స్పీడ్ తో భూమి చుట్టూ తిరగొచ్చట. సుమారుగా 90 నిమిషాలకోసారి.. 24 గంటల్లో 16 సార్లు భూమిని చుట్టేయొచ్చట. ఈ స్పేస్ హోటల్ రెడీ అయితే మస్త్ ఉంటది కదా! హోటల్ బాగుంటది గానీ.. టికెట్ రేటే రూ. 25 లక్షలు ఉండొచ్చట!