హైదరాబాద్, ఫిబ్రవరి 1
కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలతో పాటు సినీ రంగం కూడా నానా ఇబ్బందులు ఎదుర్కొంది. ఫస్ట్, సెకండ్ వేవ్స్ వల్ల షూటింగ్స్ నిలిచిపోయి, 50 శాతం ఆక్యుపెన్సీకి పర్మిషన్ ఇచ్చినా ప్రేక్షకలు థియేటర్లకు వచ్చే సాహసం చెయ్యక.. అనౌన్స్ చేసిన డేట్‌కి సినిమాలు రిలీజ్ చెయ్యలేక నిర్మాతలు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.ఫస్ట్ వేవ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ థియేటర్లకు భారీగా ప్రేక్షకాభిమానులను రప్పించింది. ఇక అదే ఊపు కంటిన్యూ అవుతుంది అనుకుంటే ఇంతలో సెకండ్ వేవ్ వచ్చి పడింది. కొంత గ్యాప్ తర్వాత నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ సినిమాకి ఆడియన్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, ‘రిపబ్లిక్’ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసాయి.
లవ్ స్టోరీ’తో మహేష్ బాబుకి లాభం
అయినప్పటికీ మరో కొత్త వైరస్ రావడం.. మళ్లీ నైట్ కర్ఫ్యూలు, థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ, ఏపీలో టికెట్ రేట్ల అంశం, థియేటర్లు సీజ్, సినిమాలు ఆడుతున్నప్పటికీ ఈ టికెట్ రేట్లతో కష్టమని హాళ్లు మూసెయ్యడం లాంటి పరిణామాలతో టాలీవుడ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
అరవై రోజులు.. అయినా ఆగని ‘అఖండ’ అరాచకం!
తర్వాత వచ్చిన నటసింహ నందమూరి బాలకృష్ణ ‘అఖండ’, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి కొత్త ఊపుని, ఉత్సాహాన్ని ఇచ్చాయి. బాలయ్య రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో, కర్ణాటకలో రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ రాబట్టగా.. పాన్ ఇండియా స్థాయిలో బన్నీ ‘పుష్ప’ తో సెన్సేషన్ క్రియేట్ చేసాడు.
వంద కోట్ల క్లబ్ లో చేరిన పుష్ప!
ఇక రాబోయేది 2022.. కొత్త సంవత్సరం, కొత్త ప్రారంభం, సరికొత్త ఉత్సాహం అనుకుంటున్న నిర్మాతలకు మళ్లీ దెబ్బ మీద దెబ్బ.. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ లాంటి పాన్ ఇండియా సినిమాల కోసం తమ సినిమాల విడుదల పోస్ట్ పోన్ చేసుకున్నారు కానీ చివరి నిమిషంలో అవి కూడా వాయిదా పడ్డాయి. నాగార్జున మాత్రం డేర్ చేసి ‘బంగార్రాజు’ తో సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టాడు.
బంగార్రాజు’ ల బాక్సాఫీస్ ర్యాంపేజ్! 50 కోట్ల క్లబ్‌లో..
ఇక్కడి వరకు బాగానే ఉంది.. మరి వాయిదా పడ్డ సినిమాల పరిస్థితి ఏంటి?.. కొత్తగా డేట్ అనౌన్స్ చేసిన సినిమాల సంగతేంటి?.. పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాల విషయం పక్కన పెడితే అసలు చిన్న సినిమా పరిస్థితి ఏంటి?.. నానా గందరగోళంగా ఉన్న టాలీవుడ్‌లో సోమవారం సాయంత్రం మళ్లీ సందడి మొదలైంది.. వరుసగా ఐదు క్రేజీ సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు మేకర్స్.
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చెయ్యగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆచార్య’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానాల మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’, విక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడిల ఫన్ రైడర్ ‘ఎఫ్ 3’, సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాలు కొత్త రిలీజ్ డేట్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.‘భీమ్లా నాయక్’ కోసం రెండు రిలీజ్ డేట్స్.. సమ్మర్‌లోనే ‘సర్కారు వారి పాట. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో టాలీవుడ్‌లో మళ్లీ పండుగ వాతావరణం కనిపించనుంది. థియేటర్లకు ప్రేక్షకాభిమానులు భారీగా తరలి రాబోతున్నారు. బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది. ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా ‘ఆర్ఆర్ఆర్’ క్రియేట్ చేసే సెన్సేషన్ కోసం తెలుగు ఇండస్ట్రీ అంతా ఎదురు చూస్తుంది. ప్రభాస్ పాన్ ఇండియా ఫిలిం ‘రాధే శ్యామ్’ మార్చిలోనే రిలీజ్ కానుందని తెలుస్తుంది.