YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఘనంగా రాష్ట్ర హోం మంత్రి జన్మదిన వేడుకలు

 ఘనంగా రాష్ట్ర  హోం మంత్రి జన్మదిన వేడుకలు

రాష్ట్ర హోం, కార్మిక శాఖా మంత్రి నాయిని నరసింహ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం నాడు ఘనంగా జరిగాయి. బంజారాహిల్స్ లోని మంత్రి అధికారిక నివాసానికి ఉదయాన్నే కార్యకర్తలు, అధికారులు, అభిమానులు విచ్చేసి మంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయo బ్రాహ్మణులు వేద మంత్రాలు  చదివి ఆశీర్వదించారు. అనంతరం బంధువులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ అభిమాన నాయకుడైన హోం మంత్రి కి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ హోం మంత్రి కి సందేశాలను  పంపారు రాష్ట్ర డీజీపీ  ఎం. మహేందర్ రెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ ఎం భగవత్ స్వయంగా మంత్రి ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడిన హోం మంత్రి బంగారు తెలంగాణా నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. తెరాస  ప్రభుత్వం ఎన్నో రంగాలలో అగ్రగామిగా నిలిచిoదని దీనితో పలు రాష్ట్రాల నుంచి ప్రశంసలు వచ్చాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణా రాష్ట్రాన్ని అభివృద్ధి పధం లో పయనింప చేసేందుకు జీవితాంతం కృషి చేస్తానన్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినవారందరికీ హోం మంత్రి ధన్యవాదాలు తెలిపారు. 

Related Posts