న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1,
కరోనా సమయంలో మరో బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు ప్రసంగం మొదలుపెట్టారు ఆమె. ఈ ఏడాది వృద్ధి రేటు 9.2 శాతం దాటుతుందని అంచనా. వృద్ధి రేటులో ముందున్నామని నిర్మలా సీతారామన్ ప్రకటించుకున్నారు. వ్యాక్సినేషన్ క్యాంపెయిన్‌జోరుగా సాగుతోంది. కొవిడ్ కట్టడిలో వ్యాక్సినేషన్ కీలకంగా వ్యవహరించిందని పేర్కొన్నారు ఆర్థిక మంత్రి. ఆత్మనిర్భర్ స్ఫూర్తితో ముందుకు సాగనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. వంట నూనె దేశీయంగా తయారీపై దృష్టి. వెయ్యి లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరిస్తామన్నారు. బడ్జెట్ ప్రసంగంలో కీలకాంశాలు కొన్ని.. పీఎం ఆవాస్ యోజన కింద 18 లక్షల ఇళ్లు. 48 వేల కోట్లు కేటాయింపు. 75 జిల్లాలో 75 డిజిటల్ బ్యాంకింగ్ కేంద్రాలు. తృణ ధాన్యాల సంవత్సరంగా 2023. యాప్‌లో ప్రజలకు అందుబాటులో బడ్జెట్. వచ్చే ఐదేళ్లలో మేకిన్ ఇండియాలో భాగంగా 60 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రణాళికగా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి ప్రకటించారు. ఇంటి ఇంటికి మంచి నీటి కోసం 60 వేల కోట్ల కేటాయింపు.వ్యవసాయ రంగానికి ఆధునిక టెక్నాలజీని ఉపయోగం, భూ రికార్డులను డిజిటలైజేషన్. డ్రోన్‌లతో పంట పొలాల పరిరక్షణ. సేంద్రీయ వ్యవసాయానికి ప్రత్యేక రాయితీల ప్రకటన. పీఎం ఈ విద్య కోసం 200 ఛానెల్స్. ప్రాంతీయ భాషల్లో విద్యాబోధన.. 1.12 తరగతులకు వర్తింపు. ఆతిథ్య రంగానికి రూ. 5 లక్షల కోట్ల కేటాయింపులు. మైక్రో, చిన్నతరహా కంపెనీలకు 2 లక్షల కోట్ల కేటాయింపులు. ఎంఎస్ ప్రత్యేకంగా డిజిటల్ యూనివర్సిటీ. స్టార్టప్‌లకు 2 లక్షల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో 4 మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్‌లు. అంగన్‌వాడీ 2.0 కింద 2 లక్షల అంగన్‌వాడీ కేంద్రాల ఆధునీకరణ. తెలుగు స్టేట్స్‌లో నదుల అనుసంధానంపై ప్రణాళిక. త్వరలో కృష్ణ గోదావరి, కృష్ణ పెన్నా నదుల అనుసంధానం. పెన్నా-కావేరి నదుల అనుసంధానానికి ప్లాన్. గంగా నదీ తీరంలో 5 కిలోమీటర్ల మేర సేంద్రీయ సాగు.అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలు(నెట్‌బ్యాంకింగ్, ఏటీఎం సహా) అందుబాటులోకి. ఇకపై చిప్ ఆధారిత పాస్ పోర్టులు. కొత్తగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0డిజిటల్ పేమెంట్, నెట్‌బ్యాంకింగ్ సేవలకు ప్రోత్సాహకాలు. గతిశక్తి కార్గొ టెర్మినళ్ల నిర్మాణం. కొత్త రహదారుల నిర్మాణం. పేద, మధ్య తరగతి సాధికారికత కోసం ప్రభుత్వం కృసి చేస్తోందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2022 నాటికి 5జీ స్పెక్ట్రం వేలం పూర్తి చేసే యోచన. 2023 నుంచి 5జీ సేవలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం. ప్రజా రవాణాలో ప్రత్యామ్నాయ ఇంధనలకు ప్రముఖ స్థానం. ఈ-వెహికల్స్ ప్రోత్సహకంలో భాగంగా హైవేలపై బ్యాటరీలు మార్చుకునే సదుపాయం. సోలార్ ఎనర్జీ ఉత్పత్తి కోసం 19,500 వేల కోట్ల రూ. కేటాయింపు.అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కాగిత రహిత విధానం. మానసిక ఆరోగ వ్యవస్థ కోసం జాతీయ విధానం. 10 రంగాల్లో క్లీన్‌ఎనర్జీ యాక్షన్ ప్లాన్. ఎగుమతుల ప్రోత్సాహకానికి కొత్త చట్టం. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక స్టార్టప్‌లు.
ఎక్కడి నుంచి ఎక్కడైనా
కేంద్రం నూతన భూ సంస్కరణలు తీసుకొచ్చింది. దీనికి సంబంధించి విషయాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఏకీకృత రిజిస్ట్రేషన్ పథకాన్ని(NGDRS) ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడి నుంచైనా భూములు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆధునిక వ్యవస్థను తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా డీడ్‌లు, రిజిస్ట్రేషన్లకు ఆధునిక వ్యవస్థ తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.దేశంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి 75,000 ఒప్పందాలు తొలగించామని, 1,486 యూనియన్ చట్టాలను కూడా రద్దు చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. చెల్లింపులలో జాప్యాన్ని తగ్గించడానికి అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలకు ఆన్‌లైన్ బిల్లు చెల్లింపు వ్యవస్థ గురించి కూడా సీతారామన్ మాట్లాడారు. ఎంటర్‌ప్రైజ్, హబ్‌ల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఆమె తన బడ్జెట్ 2022 ప్రసంగంలో ప్రతిపాదించారు. ఈ కొత్త చట్టం ప్రస్తుతం ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను కవర్ చేస్తుందని, ఎగుమతుల పోటీతత్వాన్ని పెంపొందిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు.
80 లక్షల ఇళ్లు
పేదలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గూడ్ న్యూస్ చెప్పారు. తన బడ్జెట్ 2022 ప్రసంగంలో 2022-23లో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పీఎం ఆవాస్ యోజనకు అర్హులైన లబ్ధిదారుల కోసం 80 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.48,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు భూమి, నిర్మాణానికి సంబంధించిన అన్ని అనుమతుల సమయాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తుందన్నారు.అందరికీ గృహాలు” అందించాలనే లక్ష్యాన్ని సాధించడానికి, భారత ప్రభుత్వం గ్రామీణ గృహనిర్మాణ పథకాన్ని రూపొందించిందన్నారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామిన్ (PMAY-G) నవంబర్ 20, 2016న ప్రారంభించారు. ఏప్రిల్ 1, 2016 నుంచి అమలులోకి వస్తుంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ (PMAY-U) 25 జూన్ 2020 నాటికి ఐదేళ్లు పూర్తయింది.ఏప్రిల్ 1న ప్రారంభం కానున్న ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ 2022 కేంద్ర బడ్జెట్‌ను మంగళవారం సమర్పించారు. ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 7.3 సంకోచం తర్వాత మార్చి 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.2 శాతం వృద్ధి చెందుతుందని అంచనా.