YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విప్లవాత్మకమైనది

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విప్లవాత్మకమైనది

హైదరాబాద్ ఫిబ్రవరి 1
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విప్లవాత్మకమని, రాబోయే పాతికేళ్ల దేశ భవిష్యత్‌కు అద్దం పట్టిన బడ్జెట్ అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశంసించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిపై స్పందించిన ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ  స్వదేశీ వ్యాక్సిన్‌తో కరోనాను కట్టడి చేసిన మోదీ ప్రభుత్వం... ‘ఆత్మ నిర్భర్’ వ్యాక్సిన్‌తో  ఆర్ధిక సుస్థిరత సాధించడం చారిత్రాత్మకమని కొనియాడారు. ఆర్దిక ఇబ్బందులున్నప్పటికీ ప్రజలపై భారం మోపకుండా పన్నుల రహిత బడ్జెట్‌ను రూపొందించడం సాహసోపేతమన్నారు. ఎన్నికల రాజకీయాలతో పనిలేకుండా దేశహితమే లక్ష్యంగా దీర్ఘకాల లక్ష్యాలతో రూపొందించిన బడ్జెట్ అన్నారు. ఎస్ఎంఈ, ఎంఎస్ఎంఈ రంగాలకు రూ.6 లక్షల కోట్ల ప్రోత్సాహకాలతో కోట్లాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాబోతున్నయన్నారు. ఇంతటి సాహసోపేత బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధాని మోదీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌లకు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts