YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బిజెపి, మోడి తెలంగాణకు ప్రధాన శత్రువు

బిజెపి, మోడి తెలంగాణకు ప్రధాన శత్రువు

వేల్పూర్
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి వివిధ పార్టీలకు చెందిన యువకులు పెద్ద ఎత్తున రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువా కప్పి టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ వనరులను దోచుకెళ్తుంటే భరించలేక కేసీఆర్ బయటకు వచ్చారు.  . తన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టారు. బలమైన ముఖ్యంత్రిగా చంద్రబాబు, ప్రతిపక్ష నేత వై.ఎస్ ఉన్నప్పటికీ వాళ్ళను ఎదురించి ఉద్యమం మొదలుపెట్టారు. నాడు కేసీఆర్ వెంట జనం అండగా నిలిచారు. నేడు 2001నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.   రాజకీయాల్లో ఉంటాం,పోతాం కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసమనేది పాయింట్.   కేసీఆర్ ఆశీర్వాదంతో నా శక్తిమేర అభివృద్ధి చేస్తున్నాను.  18 సబ్ స్టేషన్ లు ఏర్పాటు చేశాను. కరెంట్ సమస్య లేదు. నీటి కష్టాలు పూర్తిగా రూపుమాపాము. అవసరమైన అనేక చోట లిఫ్ట్ లు ఏర్పాటు చేసుకున్నాము.  అన్ని గ్రామాల్లో చెరువులు పూర్తిగా నింపుకొని ఇబ్బందిలేకుండా చేసుకున్నాం.వరదకాలువ కోసం కొన్ని వేల గంటలు పనిచేసి, అనేక రోజుల శ్రమతో రూ. 1700 కోట్లతో వరదకాలువతో పునరుజ్జీవంతో తీర్చిద్దాం.   పెద్దవాగు, కప్పలవాగు నీరు వృదాకాకుండా 14 చెక్ డ్యామ్ లు పూర్తి చేసుకున్నాం. భూగర్భజలాలు పెరిగాయి. ఇంకా 8 చెక్ డ్యాంలు  కడితే ఎప్పుడు నీటితో వాగులు ఉంటాయి.  . పెద్దవాగును ఎప్పుడు నీటితో చూడాలనే నా కల నిజం చేసుకుంటున్నానని అన్నారు.
ప్యాకేజ్ 21 ద్వారా రూ.850 కోట్లతో చేపడుతున్న పనులు పూర్తి కావస్తున్నాయి. బినోల నుంచి మన ప్రాంతానికి నీళ్లు తెచ్చే కార్యక్రమం మెమో 15 రోజుల్లో ట్రయిల్ రన్ కానుంది.  కేసీఆర్ దయవల్ల రైతుకు గోస లేకుండా పోయింది.   మూడు ఎకరాలకు ఒక బోరు ఉంటుంది. ఎలాంటి ఖర్చు లేకుండా ప్రతి ఎకరానికి నీరందించే పని జరుగుతోంది.   అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో 1కోటి 50 లక్షలతో ఆక్సిజన్ బెడ్ లు ఏర్పాటు చేశాము.   దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణను చూసి ఇప్పుడు నేర్చుకుంటున్నారు.   రైతుబంధు పథకం ప్రపంచంలోని అభివృద్ధి దేశాలను ఆశ్చర్య పరుస్తోంది.   గుంట భూమి ఉన్న రైతుకు కేసీఆర్ రూ.5లక్షల భీమా  అందిస్తాన్నారు. ఇలాంటి పథకం ఎక్కడ లేదు.  పేదల కోసం రూ. 2016 పెన్షన్ ఇస్తున్నాము. ప్రధాని రాష్ట్రం గుజరాత్ లో కూడా రూ. 1000 మాత్రమే ఉంది. కానీ కేసీఆర్ మాత్రం ఎక్కడ లేని పెన్షన్ ఇక్కడ ఇస్తున్నాం. పార్టీలకు అతీతంగా తెలంగాణలో అన్ని పథకాలు అందిస్తున్నది ఒక్క తెలంగాణనే.   ఆడబిడ్డ పెళ్లికి అవస్థలు రావద్దని రూ 1లక్ష 116 ఇస్తున్న మనసున్న మహారాజు కేసీఆర్  కాన్పు కంటే ముందు కాన్పు తర్వాత పేద బిడ్డకు కూడ మూడు నెలల రెస్ట్ అవసరమని ప్రభుత్వం నెలకు రూ.2000 ఇ చ్చే కార్యక్రమం కేసీఆర్ చేపట్టారు.  పేదింటి బిడ్డ కూడ పెద్దింటి బిడ్డ మాదిరి పుట్టినప్పుడు రూ.12 వేలు ఇవ్వవడంతో పాటు, కేసీఆర్ కిట్టు అందిస్తున్న మానవత్వం ఉన్న మనిషి కేసీఆర్. తండ్రి లాంటి కేసీఆర్ ను నోటికొచ్చినట్లు, ఇష్టమున్నట్లు ఎన్నిన్ని మాటలు అంటూన్నరో ప్రజలకు తెలుసనిఅన్నారు.
విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క మాట బీజేపీ నిలుపుకోలేదు.గిరిజన యూనివర్శిటీ, ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు.  ... జిఎస్టీ 3వేల కోట్లు ఇవ్వడం లేదు.పైగా తెలంగాణ రాష్ట్రాన్ని శత్రువుగా చూస్తోంది. 150 మెడికల్ కాలేజీలు ఇతర రాష్ట్రాలకు ఇస్తే,ఒక్క కాలేజీ కి నిధులు ఇవ్వలేదు....నాడు ఆంధ్ర పాలకులు, నేడు బీజేపీ ఒకేలా ఉన్నాయి.తెలంగాణ ధాన్యాన్ని కొనలేదు.కేంద్ర మంత్రి వెటకారంగా మాట్లాడతాడు.మాకు వేరే పనులు లేవు,రైతుల పనులే ముఖ్యం అని చెప్పాము.  ఎంపీ అర్వింద్ గ్రామాల్లో ఒక్క పని చేశాడా ? ప్రజలకు పనులు చేయవు. రాష్ట్రానికి వచ్చే నిధులపై కేంద్రాన్ని అడగవు. పసుపు బోర్డు తేడు. సురేష్ రెడ్డి పార్లమెంట్లో పసుపు బోర్డు పై అడిగితే ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి తేల్చిచెప్పారు. అలాంటి పరిస్థితే వస్తే అర్వింద్ స్థానంలో నేనుంటే బండగట్టుకొని బాయిలో పడుతుంటిననని అన్నారు.

Related Posts