YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సమ్మెకు సై అంటున్న ఉద్యోగులు

సమ్మెకు సై అంటున్న ఉద్యోగులు

విజయవాడ, ఫిబ్రవరి 2,
పీఆర్సీ విషయంలో అనుకున్న ప్రకారం ఉద్యమం ముందుకెళ్తుందని, ఎల్లుండి చలో విజయవాడ యధాతధంగా జరుగుతుందని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంగళవారం నాడు మంత్రుల కమిటీతో ఉద్యోగుల స్టీరింగ్ కమిటీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. స్టీరింగ్ కమిటీ పెట్టిన మూడు ప్రతిపాదనలు సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. దాంతో ఉద్యోగులు ఉద్యమ బాట పట్టాలని నిర్ణయించారు. మంత్రుల కమిటీతో చర్చలు విఫలమైన తరువాత ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. గతంలో చర్చలకు పిలిచామని చెప్పి ప్రభుత్వం ఏం చేసిందో ఇవాళ కూడా అదే చేసిందని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు అన్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం తాము నష్ట పోతున్నట్టు వారికి పదేపదే చెప్పామని, అయినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఇవాళ మంత్రుల కమిటీ సమావేశంలోనూ అదే పాత అంశాలపైనే మాట్లాడారని చెప్పారు. మూడు అంశాలపై తేల్చాలని స్పష్టం చేశామని, అవి సాధ్యపడదని ప్రభుత్వం తరఫున సమాచారం ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని అన్నారు. ఈ కారణంగానే ఉద్యమ కార్యాచరణ యధావిధిగా జరుగుతుందన్నారు. ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు ఉద్యోగ సంఘాల నేతలు. జిల్లాలోని కలెక్టర్‌లు.. ఛలో విజయవాడకు వెళ్ళొద్దని ఉద్యోగులకు చెప్పే ప్రైవేటు క్లాసులు మానుకోవాలని వ్యాఖ్యానించారు. ఉద్యోగులను భయ బ్రాంతులకు గురిచేయొద్దని కలెక్టర్లను కోరుతున్నామన్నారు. ప్రభుత్వానికి వత్తాసు పలికే పనులు మానుకోవాలని కోరారు. సమ్మెలు, ఆందోళనలు తాత్కాలికమే అని, మళ్ళీ అంతా కలిసి పనిచేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.ఉద్యోగ సంఘానికి చెందిన మరో నేత వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వానికి మా అభ్యంతరాలు ఇప్పటికే తెలియజేశాం. లిఖితపూర్వకంగా ఆహ్వానం వచ్చాకే ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాం. డీడీఓ లను బెదిరించి కొత్త జీతాలు వేశారు. పీఆర్సీ నివేదిక చాలా ముఖ్యమని, జీవోలను పక్కన పెట్టాలని స్పష్టంగా చెప్పాం. దానిపై ప్రభుత్వ కమిటీ నుంచి ఎలాంటి స్పందనా లేదు. అందుకే యధావిధిగా ముందుగా ఇచ్చిన ఛలో విజయవాడ కార్యక్రమం జరుగుతుంది.’’ అని అన్నారుపీఆర్సీ సాధన సమితి నేత కె.సూర్యనారాయణ మాట్లాడుతూ.. వేతన సవరణ అంశాన్ని ఓ ప్రహసనంలా ప్రభుత్వం తయారు చేసిందని విమర్శించారు. ఇవాళ జరిగిన మంత్రుల కమిటీ కూడా దానికి ఓ ఉదాహరణ అని పేర్కొన్నారు. బలవంతపు నిర్బంధ వేతన సవరణను నిలుపుదల చేయాలని కోరామన్నారు. పీఆర్సీ నివేదిక ఇవ్వాలని కూడా కోరామన్నారు. నిర్బంధంగా కొత్త పే స్కెల్ తో వేతనాలు ఖాతాల్లో వేయడాన్ని ఖండిస్తున్నామని ప్రకటించారు. వేతనాలకు సంబంధించి మార్చి 31 వరకు అమలు చేయాలని గతంలో ఉత్తర్వులు ఇచ్చి.. మళ్ళీ రాత్రికి రాత్రే వాటిని ఎలా అమలు చేస్తారని సూర్యనారాయణ ప్రశ్నించారు. దీనిపై సిబ్బంది వ్యవహారాల శాఖలో ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 2016 నుంచి సీసీఏ కేంద్ర ప్రభుత్వ వేతన కమిషన్ ప్రకారం అమల్లో ఉన్నదాన్ని ఇప్పుడు తమ పీఆర్సీలో ఎలా తీసేస్తారని ప్రభుత్వాన్ని సూర్యనారాయణ ప్రశ్నించారు. ఇది పూర్తిగా ఉద్యోగులను మోసం చేయడమేనని అన్నారు. తమకు రావాల్సిన డీఏ బకాయిలను వేతనంలో కలిపేసి జీతాలు పెరిగాయని చెప్పడం ప్రభుత్వం మోసం చేయడమే అవుతుందన్నారు.

Related Posts