YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

భారీగా పెరిగిన మిర్చి

భారీగా పెరిగిన మిర్చి

గుంటూరు, ఫిబ్రవరి 2,
గుంటూరు మిర్చి యార్డులో ధరలు భారీగా పెరిగాయి. ప్రతి వెరైటీకి క్వింటాలు రూ.2 వేల నుంచి రూ. 3 వేల వరకు పెరుగుదల నమోదైంది. సోమవారం 1,06,181 టిక్కిలు రాగా, 90,581 క్వింటాలు అమ్ముడుపోయాయి. పాత నిల్వలతో కలిపి 64,990 టిక్కిలు ఇంకా నిల్వ ఉన్నాయి. నాన్‌ ఎసి కామన్‌ వెరైటీకి క్వింటాలు గరిష్టంగా రూ.18 వేలు ధర పలికింది. నాన్‌ ఎసి స్పెషల్‌ వెరైటీకి సగటు ధర రూ.18,200 వచ్చింది. ఎసి కామన్‌ వెరైటీ గరిష్ట ధర రూ.17 వేలు ఉండగా, ఎసి స్పెషల్‌ వెరైటీకి రూ.17,500 వరకు ధర లభించింది. ప్రస్తుత ధరలతో పోలిస్తే గతవారం ప్రతి వెరైటీకి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు తక్కువగా ధర నమోదైంది. వివిధ జిల్లాల నుంచి కొత్త సరుకు యార్డుకు వస్తోంది. బెంగళూరు ప్రాంతానికి చెందిన 2043 బేడిగ రకం మిర్చి ధర క్వింటాలుకు గరిష్టంగా రూ.22 వేల వరకు పలికిందని వ్యాపారులు తెలిపారు. మిర్చిలో అత్యధిక డిమాండ్‌ ఉన్న తేజ, బాడిగ రకాలు రాష్ట్రంలో పండిన వాటికి మాత్రం క్వింటాలు రూ.18,500 వరకు పలికినట్టు వ్యాపార వర్గాలు తెలిపాయి. గత ఏడాది పండిన సరుకు ఇప్పటికీ కోల్డ్‌ స్టోరేజీల్లో పది లక్షల టిక్కిల వరకు ఇంకా ఉంది. తామర తెగులు తట్టుకుని నిలదొక్కుకున్న మిర్చి వెరైటీలు కూడా యార్డుకు వచ్చాయి. రాష్ట్రంలో ఈ ఏడాది మిర్చి తామర తెగులు వల్ల 70 శాతం విస్తీర్ణంలో పంట దెబ్బతినడంతో ధరలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు

Related Posts