YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆళ్ల నానికి ఎందుకిలా

ఆళ్ల నానికి ఎందుకిలా

విజయవాడ, ఫిబ్రవరి 2,
ఆంధ్రప్రదేశ్ వైసీపీ లో ముగ్గురు నానిలు ఉన్నారు. మంత్రివర్గంలోనూ వీరి ముగ్గురికి జగన్ ప్రధాన శాఖలను కేటాయించారు. ఏలూరు నుంచి గెలిచిన ఆళ్ల నాని, గుడివాడ నుంచి గెలిచిన కొడాలి నాని, మచిలీపట్నం నుంచి గెలిచిన పేర్ని నానిలు మంత్రివర్గంలోనే కాకుండా పార్టీ పరంగా కూడా ప్రధాన భూమికను పోషించాల్సి ఉంటుంది. వీరిలో ఆళ్లనాని, పేర్ని నాని కాపు సామాజికవర్గం కాగా, కొడాలి నాని కమ్మ సామాజికవర్గం. ముగ్గురూ పార్టీకి, ప్రభుత్వానికి ఉపయోగపడతారన్న లెక్కలు వేసి మరీ జగన్ తన కేబినెట్ లో తీసుకున్నారు.  అయితే ఈ ముగ్గురిలో పేర్ని నాని, కొడాలి నాని యాక్టివ్ గానే ఉన్నారు. యాక్టివ్ అనే కంటే హైపర్ యాక్టివ్ అనడం బెటరేమో. వీరిద్దరూ జగన పైనా, ప్రభుత్వంపైన ఎవరూ విమర్శలు చేసినా వెంటనే విరుచుకుపడతారు. కానీ ఆళ్ల నాని మాత్రం కాస్త వివాదాలకు దూరంగానే ఉంటారు. ఆళ్లనానికి సౌమ్యుడనే పేరుంది. ఆయన కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను పర్యవేక్షిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నా ఆయన ఇన్ వాల్వ్ మెంట్ అంతంత మాత్రమేనని చెప్పాలి. ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ సమ్మెలోకి వెళతామని ప్రకటించినా ఆళ్ల నాని పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ముఖ్యమంత్రి జగన్ నిర్వహించే సమీక్షలకు హాజరుకావడం మినహా ఆళ్ల నాని అన్నింటికి దూరంగానే ఉంటూ వస్తున్నారు. తన సొంత నియోజకవర్గమైన ఏలూరులోనూ ప్రజలకు అందుబాటులో ఉండరన్న విమర్శలున్నాయి. పార్టీ కార్యక్రమాలను, ప్రభుత్వ కార్యక్రమాలలో ఆయన తక్కువగానే కన్పిస్తారు. ప్రచారం ఎక్కువగా ఇష్టపడకపోయినా కనీసం పార్టీ కోసమైనా ఆయన ప్రజల ముందుకు రావాల్సి ఉంది. కానీ ఆయన రావడం లేదు. నిజానికి ఆళ్ల నానికి 2014 ఎన్నికల్లో ఓటమి పాలయినా ఎమ్మెల్సీ పదవి జగన్ ఇచ్చి గౌరవించారు. ఆళ్లనానికి జగన్ అంతగా ప్రాధాన్యత ఇచ్చారు. మంత్రిగా రాష్ట్రాన్ని తీసి పక్కన పెడితే తన జిల్లాలోనైనా పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఆళ్ల నాని పై ఉంది. కానీ జిల్లాలో పార్టీ రోజురోజుకూ బలహీనం అవుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు. స్థానికసంస్థల ఎన్నికల ఫలితాల్లో ఈ విషయం స్పష్టంగా తెలిసాన ఆళ్ల నాని మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Related Posts