YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

బాలగంగాధర్ తిలక్ టెర్రరిస్టుల పితామహుడట! 8వ తరగతి పాఠ్యపుస్తకంలో దొర్లిన పొరపాటు రాజస్థాన్ లో చెలరేగిన దుమారం

బాలగంగాధర్ తిలక్ టెర్రరిస్టుల పితామహుడట!    8వ తరగతి పాఠ్యపుస్తకంలో దొర్లిన పొరపాటు         రాజస్థాన్ లో చెలరేగిన దుమారం

స్వాతంత్ర్య సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ గురించి ఓ పాఠ్యపుస్తకంలో దొర్లిన పొరపాటు రాజస్థాన్ లో పెద్ద దుమారాన్ని రేపుతోంది. 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని 22వ చాప్టర్ లో '18, 19వ శతాబ్దాల్లో జాతీయ ఉద్యమ పరిణామాలు' అనే పాఠం ఉంది. ఇందులో బాలగంగాధర్ తిలక్ గురించి చెబుతూ, 'జాతీయ ఉద్యమానికి తిలక్ మార్గనిర్దేశం చేశారు. ఆయనను టెర్రరిస్టుల పితామహుడు అని పిలిచేవారు' అని పేర్కొన్నారు. దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది. రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కు అనుబంధంగా పని చేసే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల కోసం మధురకు చెందిన ఓ ప్రింటర్ దీన్ని ముద్రించారు.

Related Posts