YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

గుంపుల్లో విద్యార్థులు

గుంపుల్లో విద్యార్థులు

వరంగల్, ఫిబ్రవరి 2,
విద్యాసంస్దలు ప్రారంభించిన కోవిడ్ నిబంధనలు పాటించడంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరగతి గదుల్లో చిన్నారులను బెంచీకి నాలుగు చొప్పన కూర్చోబెట్టి భౌతికదూరం పాటించడంలేదని పేర్కొంటున్నారు. చాలామంది విద్యార్ధులు దగ్గు, జలుబు వంటి లక్షణాలతో ఉన్నరని ఇలాంటి పరిస్దితుల్లో తరగతికి 20మందికి మించకుండా బోధన చేయాలని ప్రభుత్వం సూచించిన పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. దీనికితోడు మొదటి రోజు విద్యార్థులు ఆశించిన స్దాయిలో హాజరైన ఉపాధ్యాయులు మాత్రం సగంమంది కూడా రాలేదని యాజమాన్యాలు చెబుతున్నారు. టీచర్లు వైరస్ లక్షణాలతో ఉన్నారని తగ్గేవరకు విధులకు హాజరుకావద్దని సూచనలు చేయడంతో తక్కువ సంఖ్యలో సిబ్బంది హాజరైనట్లు వెల్లడించారు. వారం రోజుల పాటు పాఠాలు బోధించడం కష్టమని, పూర్తి స్దాయి విద్యార్ధులు, సిబ్బంది హాజరుకావాలంటే సమయం పడుతుందని తెలిపారు. ప్రభుత్వం సూచించిన విధంగా తరగతి గదిలో 20మంది విద్యార్థులను కూర్చోబెట్టడం సాధ్యంకాదని, ఆవిధంగా ఉండాలంటే ప్రస్తుతం ఉన్న రూమ్‌లు సరిపడవని, మరో భవనం ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుందని ప్రైవేటు విద్యాసంస్దలు పేర్కొంటున్నారు.ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా రెండు ఏళ్ల నుంచి ఆర్దిక సమస్యలు ఎదుర్కొంటామని, అదనపు గదులు ఏర్పాటు చేయడం మరింత భారమైంతుందంటున్నారు. కొన్ని పేరు మోసిన కార్పొరేట్ స్కూళ్లు ఇంకా ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు, పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడితే ప్రత్యక్ష పాఠాలు బోధిస్తామని చెబుతున్నారు. అప్పటివరకు విద్యార్థులు ఇంట్లో ఉండి ఆరోగ్యం కాపాడుకోవాలని సూచిస్తున్నారు. జిల్లాలో 685 ప్రభుత్వం పాఠశాలలుండగా వాటిలో 1.10లక్షల మంది విద్యనభ్యసిస్తుండగా మంగళవారం 74 వేల మంది విద్యార్ధులు హాజరైన్నట్లు, ప్రైవేటు స్కూళ్లు 1845 ఉండగా 7.20లక్షల మంది చిన్నారులు చదువులు కొనసాగిస్తుండగా మొదటి రోజు 60శాతం మాత్రమే విద్యార్థులు బడులకు వచ్చినట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. పూర్తిస్దాయిలో విద్యార్థులు హజరుకావడం మరో పది రోజులు పడుతుందని భావిస్తున్నారు. త్వరలో కోవిడ్ నిబంధనలు పాటించని స్కూళ్లను తనిఖీలు చేసి జాగ్రత్తలు పాటించేలా చర్యలు చేపడుతామని, నిబంధనలు విస్మరిస్తే బడులకు తాళం తప్పదని హెచ్చరిస్తున్నారు.

Related Posts