గుంటూరు
ఆరవ పటాలం లో మియవాకి పద్ధతిలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని డీజీపీ గౌతం సవాంగ్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి సుచరిత వర్చవల్ ద్వారా పాల్గొన్నారు. డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్ లో భాగంగా రాష్ట్రం లోని అన్ని పోలీస్ బెటాలియన్ లలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొత్తం ఎనిమిది బెటాలియన్ లలోని 15.35 ఎకరాల్లో 19,774 చెట్ల నాటే కార్యక్రమం చేపట్టారు. మియవాకి పద్దతిలో మొక్కలు నాటె కొత్త ప్రయోగం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తక్కువ విస్తీర్ణంలో ఈ ప్రయోగాత్మక కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టడం జరిగింది.
డీజీపీ మాట్లాడుతూ మియావకి విధానం ద్వారా మూడు సంవత్సరాల పాటు చెట్లను సంరక్షించాలి. తరువాత అనంతరం ఒక్క చక్కటి వృక్ష సంపద గా మారుతుంది. అటవిశాఖ అధికారుల ద్వారా భూసార పరీక్షలు ఆనంతరం ఈ మియవకి పద్దతి ద్వారా చెట్లను నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు.
మియావాకి మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రిసుచరిత
గుంటూరులో డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏపీ హోంమంత్రి సుచరిత ప్రారంభించారు. బ్రాడిపేట లోని క్యాంప్ కార్యక్రమం నుండి వర్చువల్ విధానంలో హోంమంత్రి సుచరిత పాల్గొన్నారు. మియావాకి పద్దతిలో రాష్ట్రంలోని ఎనిమిది బెటాలియన్ లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సుచరిత ప్రారంభించారు. మంగళగిరి 6వ బెటాలియన్ లో డీజీపీ గౌతం సవాంగ్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు మొక్కలు నాటారు. అన్ని బెటాలియన్ లలోని దాదాపు 15.35 ఎకరాల్లో 19,774 మొక్కలను పోలీసు అధికారులు నాటారు.
మొక్కలు నాటే కార్యక్రమంలో పోలీసు అధికారుల కుటుంబసభ్యులు, స్కూల్ విద్యార్థులు, ఫారెస్ట్ అధికారులు పాల్గొనడం విశేషం. మియావాకి పద్దతిలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచవచ్చునని హోంమంత్రి సుచరిత వెల్లడించారు. మొక్కలు నాటడంతో పాటు అవి బాగా పెరిగే వరకు సంరక్షించాలని అధికారులకు హోంమంత్రి సూచించారు. రాబోయే భవిష్యత్ తరాలకు కాలుష్యం లేని వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె అన్నారు.