YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మావోయిస్టు దళ సభ్యుడు హిడ్మా లొంగుబాటు

మావోయిస్టు దళ సభ్యుడు హిడ్మా లొంగుబాటు

ములుగు
మావోయిస్టు దళ సభ్యుడు మాడవి హిడ్మా ములుగు ఎస్సీ ముందు ఇవ్వాల లొంగిపోయారు. ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ ముందు లొంగిపోయాడు. క్రిస్తారం మండలం తొండమార్క గ్రామానికి చెందిన మాడవి హిడ్మా మావోయిస్టు పార్టీలో సభ్యుడిగా పనిచేస్తున్నారు. లొంగిపోయిన దళ సభ్యుడి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
చిన్న వయసులోనే మావోయిస్ట్ ఉద్యమంలో చేరిన హిడ్మా బస్తర్ ప్రాంతంలో ఉద్యమానికి వెన్నెముకగా ఉన్నారు. పీఎల్జీఏ-1 బెటాలియన్ కమాండర్గా, ఛత్తీస్గఢ్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. కూంబింగ్ సమయంలో భద్రతా బలగాలపై మెరుపు దాడుల్లో హిడ్మా సిద్ధహస్తుడు. ఈ ఏడాది ఏప్రిల్లో బీజాపూర్ తరెంలో సీఆర్పీఎఫ్ బలగాలు అతడు పన్నిన వ్యూహంలో చిక్కుకుని 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 76మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న 2010 నాటి తడ్మెట్ల దాడి, 2013లో జిరామ్ఘాట్ దాడి, 2017లో 27 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని హతమార్చిన ఘటనలో హిడ్మా కీలక పాత్ర పోషించాడు.

Related Posts