YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజధాని బిల్లుకు మోక్షమేనా

రాజధాని బిల్లుకు మోక్షమేనా

విజయవాడ, ఫిబ్రవరి 3,
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఏది? ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం లేదు. అందుకే,రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా రాష్ర రాజధాని ఏదో తేలేవరకు రాష్ట్రంలో  బ్యాంకు కార్యాలయం ఏర్పాటు చేయలేమని తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వు బ్యాంకు కార్యాలయం ఏర్పాటు చేయాలంటూ అమరావతి అభివృద్ధి సంస్థ చైర్మన్, అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు గతేడాది అక్టోబరు 12న లేఖ రాశారు. దీనిపై ఆర్‌బీఐ స్పందించింది. రాజధాని విషయం ప్రభుత్వం నిర్ణయించిన తర్వాతే కార్యాలయం ఏర్పాటు చేస్తామని ఆర్‌బీఐ డిప్యూటీ మేనేజర్ ఎంకే సుభాశ్రీ ఓ లేఖలో బదులిచ్చారు. ఇది జరిగి రెండు మూడు రోజులైంది. అదలా ఉంటే, తాజాగా రాజ్య  సభలో బీజేపీ రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహ రావు, అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు. రాజధానిపై నిర్ణయం రాష్ట్రానిదేనని చెప్పిన కేంద్రమమంత్రి మా దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని క్లారిటీ ఇచ్చారు.అయితే, మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్న విషయం కేంద్రానికి తెలియదని, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆ విషయం తెలియ చేయలేదని తెలిపారు. మొదట ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని మాకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత 3 రాజధానులని, పాలనా రాజధానిగా విశాఖపట్నం, జ్యుడీషియల్ కేపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతి అని చెప్పారు. మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్నట్టు అధికారికంగా తమకు తెలియదని.. తాము  కూడా వార్తల ద్వారా తెలుసుకున్నామని..కేంద్ర మంత్రి చెప్పారు. అదలా ఉంటే, కేంద్ర మంత్రి సమాధానంఫై స్పందించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, సాంకేతికంగా అంతే, అమరావతే రాజధాని, కానీ, అంటూ మెలిక పెట్టారు. ప్రభుత్వం మూడు రాజదానులకు కట్టుబడి ఉందని, రాష్ట్ర అభివృద్ధికి వికేంద్రీకరణ అవసరం అని చెప్పు కొచ్చారు. కానీ, రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పునరాలోచన చేస్తోందని, అయితే, ఆటా ఇటా నేది మాత్రం ఇప్పట్లో తేలదని ప్రభుత్వ వర్గల సమచారం. ఈ నెల రెండవ వారంలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలలో కొత్త బిల్లు వస్తుందా రాదా అనే విషయంలోనూ క్లారిటీ లేదని అనటున్నారు.

Related Posts