YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ సరెండరేనా

జగన్ సరెండరేనా

విజయవాడ, ఫిబ్రవరి 3,
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో, ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు అన్నీ సిద్దమై పోయాయి.  కత్తులు నూరుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రలలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేందుకు సిద్దమవుతున్నాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అయితే, ఏకంగా డే వన్’ నుంచే కేంద్రంపై యుద్దాన్ని ప్రకటించింది. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించింది. ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా, కేంద్ర ప్రభుత్వ విధానాలపై దండయాత్రకు సిద్దమవుతున్నాయి.కానీ, అందుకు వైసీపీ మాత్రం మినహాయింపుగా కనిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తుతోందని విపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే వైసీపే ఎంపీలు, పార్లమెంట్ లోపల వెలుపల కూడా బీజేపీకి ‘బీ’ టీమ్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ ప్రతిపాదన తెచ్చినా, ‘అంతేగా ..అంతేగా’ అంటూ వంత పాడుతున్నారు.వైసీపీ ఎంపీల తీరు చూస్తే మంచీ చెడు గురించి ఆలోచించడం, అనేదే మరిచి పోయారని పిస్తోంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో, ప్రతిపక్ష పార్టీలు అన్నీకుడా, పెగాసస్ స్పైవేర్‌పై చర్చకు పట్టుబట్టాలని ఓకే నిర్ణయానికి వచ్చాయి. అయితే, వైసీపీ మాత్రం, అందులో ఏముంది? రాజకీయ నాయకుల రహస్యాలను, ప్రభుత్వం తెలుసుకుంటే తప్పేంటి? అంటూ, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విపక్షాలనే తప్పు పడుతున్నారు. అంతే, పెగాసస్ వంటి సామాన్య ప్రజలకు సంబంధం లేని  అంశంపై చర్చ అనవసరని కూడా విజయసాయి తేల్చి చెప్పారు. అలాగే, విపక్షాలు నిరసన్ పేరుతొ, సభాకార్యక్రమాలను  స్థంబింప చేస్తే, ప్రతిపక్షాల పై కఠిన చర్యలు తీసుకోవాలని, వైసీపీ ఎంపీ ప్రభుత్వనికి ఉచిత సలహా కూడా ఇచ్చారు. నిజానికి, పార్లమెంట్ ఉభయ సభల్లో వైసీపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అక్రమ ఆస్తుల కేసుల్ నుంచి రక్షించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అంటారు. అంతే కాకుండా,వైసీపీ ఎంపీలు అనిసరిస్తున్న జీ ..జుహూర్ దోరణి వలన ముఖ్యమంత్రికి మేలు జరుగుతుందో లేదో కానీ, రాష్ట్రానికి మాత్రం తీరని అన్యాయం జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Related Posts