YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

చిన్నమ్మతో రాములమ్మ భేటీ వెనుక

చిన్నమ్మతో రాములమ్మ భేటీ వెనుక

చెన్నై, ఫిబ్రవరి 3,
సీనియర్ సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి బుధవారం జయలలిత సన్నిహితురాలు అన్నాడీఎంకే మాజీ అధినేత్రి వీకే శశికళతో భేటీ అయ్యారు. శశికళ స్వగృహంలో రాములమ్మ .. చిన్నమ్మను కలిశారు. తమిళనాడులో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వీరిద్దరి తాజా కలకయిక మరోమారు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరువురు తాజా రాజకీయ పరిస్థితిపై చర్చించినట్లు టాక్ వినిపిస్తోంది.తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంటే విజయశాంతికి మొదటి నుంచి అభిమానం ఉంది. తాను రాజకీయాల్లోకి రావడానికి జయలలితే రోల్ మోడల్ అని చాలా సార్లు చెప్పారు. ఇక శశికళతో విజయశాంతికి చాలా సన్నిహిత సంబంధాలున్న విషయం తెలిసిందే.ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శశికళ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో విజయశాంతి కలిశారు. అంతేకాదు.. జయలలిత అనారోగ్యంతో ఉన్న సమయంలో శశికళ తమిళనాడుకి సీఎం అయితే బాగుంటుంది అని వ్యాఖ్యానించారు కూడా… ఇక ఆర్కేనగర్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో శశికళ బంధువు దినకరన్‌కు మద్దతుగా విజయశాంతి ప్రచారం కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక విజయశాంతికి తమిళనాడుకి ప్రత్యేక అనుబంధం కూడా ఉంది. తమిళ సినిమాతోనే వెండి తెరపై అడుగు పెట్టిన రావులమ్మ.. టాలీవుడ్ లో హీరో రేంజ్ లో పేరు తెచ్చుకున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం.. తల్లి తెలంగాణ పేరుతో ఒక పార్టీని కూడా పెట్టారు. కాలక్రమంలో ఆ ఆపార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేశారు. ప్రస్తుతం బీజేపీ లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్నమ్మతో రాములమ్మ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Related Posts