YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గులాబీలో సీక్రెట్ సర్వే టెన్షన్

గులాబీలో  సీక్రెట్ సర్వే టెన్షన్

హైదరాబాద్, ఫిబ్రవరి 3,
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు హుజూరాబాద్ ఎఫెక్ట్ గట్టిగానే తగిలింది.ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి మళ్లీ సీఎం పీఠం హస్తగతం చేసుకునేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసేందుకు గులాబీ బాస్.. తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే ఇటు రేవంత రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ... అటు బండి సంజయ్ కన్నుసన్నల్లో కమలదళం.. తెలంగాణలో దూసుకుపోతుందీ. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడక కాదని సీఎం కేసీఆర్‌కు స్పష్టమైందీ. ఈ నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ సంస్థలతో సీఎం కేసీఆర్.. అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే సీక్రెట్ సర్వే నిర్వహించినట్లు సమాచారంఈ సీక్రెట్ సర్వే ప్రకారం... ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు నిర్వహిస్తే.. మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 40 సీట్లు మాత్రమే కారు పార్టీ ఖాతాలో పడే అవకాశం ఉందని సదరు సర్వేలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో గతుక్కుమన్న సీఎం కేసీఆర్.. రంగంలోకి దిగి... క్షేత్రస్థాయిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతోపాటు జిల్లా కమిటీలు ఏర్పాటు చేశారని.. అలాగే రాష్ట్ర కమిటిలను త్వరలో ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే కారు పార్టీ గెలుపు కోసం సీఎం కేసీఆర్ .. కొత్త ఎత్తులు వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.అందులో భాగంగా రానున్న రాష్ట్ర బడ్జెట్‌లో ప్రజాకర్షక పథకానికి శ్రీకారం చుట్టాలని... ఇది కూడా పథకంలో భాగంగా  రాష్ట్రంలోని ప్రతి ఇంటిలోని ఓ వ్యక్తి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు పడేలా ఉండాలనే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో హుజూరాబాద్ ఫార్ములాను అమలు చేస్తే ఎలా ఉంటుందీ... అలాగే ప్రతిపక్ష పార్టీల్లో ఓట్ల చీలికలు తీసుకు వచ్చేందుకు వేయాల్సిన ఎత్తుగడలు.. పార్టీలోని లీడర్ నుంచి క్యాడర్ వరకు ప్రతి ఒక్కరు... ప్రజలతో మమేకం కావడం.. కారు పార్టీని మళ్లీ ప్రజల్లో బలంగా తీసుకు వెళ్లడం కోసం ఆచరణలో పెట్టాల్సిన అంశాలు.. తదితర విషయాలను ఇప్పటికే పార్టీలోకి కీలక నేతలతో సీఎం కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది.అయితే సీఎం కేసీఆర్ సీక్రెట్‌గా నిర్వహించిన ఈ ప్రైవేట్ సర్వేలు.. తమిళనాడు, కర్ణాటకకు చెందిన సంస్థలు నిర్వహించాయని సమాచారం. అయితే ఇప్పటికే.. రాష్ట్రంలోని ఓ టీవీ ఛానల్ నిర్వహించిన సర్వేకు.. కేసీఆర్ సీక్రెట్‌గా నిర్వహించిన సర్వే .. దాదాపు ఒకేలా ఉన్నాయని తెలుస్తోంది. అయితే రానున్న ఈ రెండేళ్లు.. మాత్రం ఎన్నికల వ్యూహా కర్త ప్రశాంత్ కిషోర్‌ టీమ్ ఇకపై సర్వే నిర్వహిస్తుందని.. అందుకోసం ఇప్పటికే ప్రశాంత్ కిషోర్, కేసీఆర్‌ల మధ్య రెండేళ్ల ఒప్పందం కూడా ఖరారు అయిందని కారు పార్టీలోని ఓ సీనియర్ నేత చాలా క్లియర్ కట్‌గా స్పష్టం చేశారు.మరోవైపు.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్.. గుట్టు చప్పుడు కాకుండా సీక్రెట్ సర్వే నిర్వహిచడంపై గులాబీ పార్టీ ఎమ్మెల్యేలంతా తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వేతో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని వారు ఒత్తిడికి గురవుతున్నారని సమాచారం. ఏదీ ఏమైనా.. సీఎం కేసీఆర్ గెలుపు కోసం మళ్లీ తీవ్రాతి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎందుకంటే.. ఓ వైపు రేవంత్ రెడ్డి.. మరోవైపు బండి సంజయ్‌లు తెలంగాణలో అధికారం కోసం.. ఎంతగా కృషి చేయాలో అంతగా కృషి చేస్తున్నారు. మరి ఎన్నికల వ్యూహాకర్త  ప్రశాంత్ కిషోర్ సాయంతో ముందుకు కెళ్తున్న సీఎం కేసీఆర్.. రానున్న ఎన్నికల్లో ఏమేరకు విజయం సాధిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిందే

Related Posts