YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ఆఫ్ లైన్ బోధనతో పాటు ఆన్లైన్ బోధన కూడా కొనసాగించాలి తెలంగాణ హైకోర్టు

ఆఫ్ లైన్ బోధనతో పాటు ఆన్లైన్ బోధన కూడా కొనసాగించాలి తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్
విద్యా సంస్థల్లో ఆఫ్ లైన్ బోధనతో పాటు ఆన్లైన్ బోధన కూడా కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.  రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 20 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్లైన్ బోధన కొనసాగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు, హైదరాబాద్లో మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ద కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని పేర్కొంది. సమ్మక్క జాతరలో కొవిడ్ నియంత్రణ చర్యలు అమలు చేయాలని స్పష్టం చేసింది. సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఏజీకి హైకోర్టు ఆదేశించింది. నిర్లక్ష్యం కారణంగా  కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంది. ఈ అంశాలపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశం కరోనా పరిస్థితులపై కేసు విచారణ ఫిబ్రవరి  20కి వాయిదా వేసింది.

Related Posts