హైదరాబాద్
హైదరాబాద్ లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ గురువారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా ఇందిరా నగర్లో 210 డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ , మహమ్మద్ ఆలీ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయా రెడ్డి పాల్గొన్నారు. ఇందిరానగర్లో రూ.17.85 కోట్లతో అయిదు అంతస్తులలో 5 బ్లాక్లలో జీహెచ్ఎంసీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించింది.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నగరంతోని ప్రధాన ప్రాంతాతల్లో పేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తున్నామన్నారు. మార్కెట్లో 50 లక్షల రూపాయల విలువ చేసే ఇళ్లుఉచితంగా ఇస్తున్నామని అన్నారు. 9714 కోట్ల రూపాయలతో హైద్రాబాద్ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కడుతున్నాం. వారం రోజుల్లో కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఒకే చోట 15640 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించామన్నారు. 18 వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కడుతున్నామని మంత్రి వెల్లడించారు.