YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

అప్పుల ఊబిలో అమెరికా...

అప్పుల ఊబిలో అమెరికా...

న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 3
ప్రపంచ కుబేర దేశం అమెరికా అప్పుల ఊబిలో చిక్కుకుంది. రోజురోజుకు ఈ దేశానికి చెందిన రుణాలు పెరిగిపోవడమే గానీ.. తగ్గడం లేదని కొందరు అంటున్నారు. ఈ దేశం మొత్తం బకాయిపడ్డ మొత్తం 30 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని ఆ దేశ ట్రెజరీ శాఖ వెల్లడించింది. కరోనా కారణంగా ఈ అగ్రరాజ్యం పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిందని అప్పటి నుంచి అంతకంతకు అప్పులు పెరుగుతూనే ఉన్నాయని ఆ శాఖ ప్రతినిధులు తెలుపుతున్నారు. కొవిడ్ నుంచి బయటపడేందుకు అప్పులు చేయాల్సి వచ్చిందని అవి ఊహించని స్థాయికి చేరాయని అంటున్నారు. కొన్ని అవసరాల కోసం దేశం అంతర్గతంగానే కాకుండా విదేశాల నుంచి కూడా రుణం తీసుకున్నట్లు గతంలో ఓ చట్టసభ సభ్యుడే తెలిపారు. అయితే తాజాగా వాటి వడ్డీ మరింత పెరిగిందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యూహ కర్త డేవిడ్ కెల్లీ అమెరికా అప్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది స్వల్పకాలిక సంక్షోభం కాదు.. దీర్ఘకాలికంగా ఉండే సమస్యే అన్నారు. ధనవంతుల దేశం రాను రాను బీద దేశంగా మారే ప్రమాదం ఉందన్నారు. రాబోయే సంవత్సరాల్లో ఈ అప్పులు 5 ట్రిలియన్ డాలర్లను అధిగమిస్తాయని అన్నాడు. 2051 నాటికి ఈ మొత్తం ఫెడరల్ ఆదాయంలో సగభాగం ఉంటుందని పీటర్సన్ ఫౌండేషన్ సంస్థ తెలిపింది. కాగా అమెరికా జపాన్ చైనా నేతృత్వంలోని అంతర్జాతీయ పెట్డుబడిదారి సంస్థలకు  దాదాపు 8 ట్రిలియన్ డాలర్లు బకాయిపడినట్లు తెలుస్తోందని అంటున్నారు.
ప్రపంచ దేశాలకు పెద్దన్నగా భావించే అమెరికా ఇంతటి అప్పుల్లో కూరుకుపోవడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. గతంలో ఆ దేశ కీలక చట్టసభ సభ్యుడుగా ఉన్న మూనీ బైడెన్ అమెరికా అప్పులు పెరిగిపోతున్నాయని హెచ్చరించాడు. ఇదిలాగే కొనసాగితే రాను రాను తీవ్ర సంక్షోభంగా మారే అవకాశం ఉందని అన్నారు. అమెరికాకు అన్ని రంగాల్లో సవాల్ విసురుతున్న చైనాకు పెద్ద మొత్తంలో అప్పులు ఉన్నాయన్నారు. భారత్ కు సైతం 216 బిలియన్ డాలర్లు రుణపడి ఉన్నారని తెలిపారు.
2020 నాటికి అమెరికా జాతీయ అప్పులు 23.4 ట్రిలియన్ డాలర్లుగా ఉండేవి.  అవి ఇప్పుడు 30 ట్రిలియన్ డాలర్లకు చేరకున్నాయి. అంటే రెండేళ్లలోనే 7 ట్రిలియన్ డాలర్లు పెరిగాయి. అంటే అప్పులు తీర్చే మార్గం కాకుండా వాటిని రెట్టింపు చేస్తున్నారని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏం చేస్తున్నారో తెలియడం లేదని కొందరు విమర్శిస్తున్నారు. తప్పుడు లెక్కలు చూపుతూ మభ్య పెడుతున్నారని అంటున్నారు.

Related Posts