YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

జాతీయ రాజకీయాల్లోకి.. మమతా, కేసిఅర్ ...

జాతీయ రాజకీయాల్లోకి.. మమతా, కేసిఅర్ ...

న్యూ డిల్లీ  /  హైదరాబాద్ ఫిబ్రవరి 3
ఈ సీనియర్ నేతలిద్దరూ తొందరలోనే రాష్ట్ర రాజకీయాలను వదిలేస్తారా ? వీరి వ్యవహారశైలి చూస్తుంటే అదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీ వైఖరి ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ఇప్పటికే  మమత మాత్రం తన మనోభావాలను స్పష్టంగా ప్రకటించేశారు. తొందరలోనే వీళ్ళద్దరు రాష్ట్ర రాజకీయాలను వదిలేసి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని అనుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని కేసీఆర్ డైరెక్టుగా చెప్పలేదు.రాష్ట్రంలో పార్టీని ప్రభుత్వాన్ని జాగ్రత్తగా చూసుకుంటామని మాటిస్తే తాను జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిద్దామని అనుకుంటున్నట్లు ప్రకటించారు. మరోసారి అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా మమత ఈ విషయం చెప్పారు. అంటే జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నట్లు ప్రకటించేశారు. వీళ్ళద్దరు తమ కోరికను తీర్చుకోవటానికి కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ నేపధ్యాన్ని ఉపయోగించుకునేందుకు డిసైడ్ అయ్యారు. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని కేసీయార్ ఎప్పటి నుండో ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే తమిళనాడు సీఎం స్టాలిన్ ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ మమతాబెనర్జీని కూడా కలిశారు. ఎన్డీయేయేతర యూపీయేయేతర పార్టీలను ఏకం చేయాలనేది కేసీయార ఆలోచన. అయితే ఆ ఆలోచన అప్పట్లో ఆగిపోయింది. ఇదే కోరిక మమతకు కూడా బలంగా ఉన్నా ఆమె ప్రయత్నాలు కూడా ముందుకు పడలేదు. దాంతో ఇద్దరు చప్పుడు చేయకుండా కూర్చున్నారు. అలాంటిది తాజా బడ్జెట్ పై దేశవ్యాప్తంగా  నిరసనలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలోనే వీళ్ళిద్దరితో పాటు స్టాలిన్ కూడా నిరసన గళం వినపించారు.అందుకనే కేసీయార్ మమత మళ్ళీ యాక్టివ్ అవ్వటానికి డిసైడ్ అయ్యారు. కేసీయార్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే ఆయన స్ధానంలో కొడుకు మంత్రి కేటీయార్ కు పట్టం కట్టే అవకాశముంది. అలాగే బెంగాల్లో మమత స్ధానంలో మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పగ్గాలు చేపట్టే అవకాశముంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

Related Posts