YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కాన్వాయి ఆపి… కారు దిగిన ముఖ్యమంత్రి

కాన్వాయి ఆపి… కారు దిగిన ముఖ్యమంత్రి

చెన్నై
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీఎం ఎంకే స్టాలిన్‌ తనదైన పాలనతో ప్రజలకు చేరువవుతున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో చెన్నైలోని టీటీకే రోడ్‌లో ఓ యువకుడు సీఎం సార్‌ హెల్ప్‌ మీ అంటూ ప్లకార్డును పట్టుకుని నిల్చొని ఉన్నారు. దీనిని గమనించిన సీఎం స్టాలిన్‌ తన కారును ఆపి ఆ యువకుడితో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎన్‌ సతీష్‌ దేశమంతటా నీట్‌ మినహాయింపులు తీసుకు వచ్చేలా చూడాలని సీఎం స్టాలిన్‌ను విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తమిళనాడులో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షలను వ్యతిరేకిస్తున్నందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts