ఏలూరు
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ను జిల్లా కేంద్రం కావాలని కోరుతూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు దీనిలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు దిష్టిబొమ్మ తో శవ యాత్ర నిర్వహించారు. ఈ యాత్ర ను పోలీసులు అడ్డుకున్నారు. టిడిపి నాయకులకు పోలీసులకు వాగ్వివాదం, తోపులాట జరిగింది.దీంతో టిడిపి నాయకులు పోలీసులు డౌన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు అనంతరం పట్నంలో ర్యాలీ నిర్వహించారు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న వారికి సంఘీభావం తెలిపారు.