ఏలూరు
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ వాసవి ప్రసిద్ధి పుణ్యక్షేత్రం వాసవి నామస్మరణంతో మారుమ్రోగింది ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకుని.. 40 రోజుల వాసవి దీక్షను ఆచరించిన మాలధారులు అమ్మవారికి ఇరుముడి సమర్పించి మ్రొక్కలు చెల్లించుకుని దీక్ష విరమించుకున్నారు..102 కలశములతో మహిళలు అమ్మవారి పల్లకితో గ్రామ పురవీధుల్లో ఊరేగుతూ..
అమ్మవారిని దర్శించుకుని కలశములును సమర్పించారు అమ్మవారికి ప్రత్యేక అభిషేకములు అర్చనలు నిర్వహించారు.. ఆలయ ప్రాంగణంలో 102 హోమాలతో మహాయాగంలో 40 రోజుల వాసవి దీక్ష పరులు పాల్గొని యాగం నిర్వహించారు.. అదేవిధంగా పెనుగొండ వాసవి శాంతి ధామ్ లో రిషి గోత్ర సువర్ణ మందిరంలో 102 అడుగుల పంచలోహ విగ్రహం ప్రాంగణంలో పెద్ద ఎత్తున మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అమ్మవారిని దర్శించుకునేందుకు కర్ణాటక ,కోయంబత్తూర్, బెంగళూరు, కేరళ ,తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున విచ్చేసారు.. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు