YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మట్టిలో మాణిక్యం ఈ అంజనమ్మ

మట్టిలో మాణిక్యం ఈ అంజనమ్మ

కడప, ఫిబ్రవరి 4
సరస్వతి అనుగ్రహం ఉండాలంటే లక్ష్మీ దేవీ కాటాక్షం ఉండాలని చాలా మంది భావిస్తుంటారు. అంటే డబ్బు ఉన్న వారికే సరైన విద్య లభిస్తుంది. వారే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారని చాలా మంది భావన. అయితే ఇది కేవలం భావన మాత్రమే అని ఎంతో మంది నిరూపించారు. నిరుపేద కుటుంబాల్లో జన్మించి కూడా ఉన్న స్థానాలకు చేరుకున్నారు. సాధించాలనే తమ సంకల్పం ముందు కుటుంబ పరిస్థితులు అడ్డంకులు కావని నిరూపించారు. అలాంటి జాబితాలోకే వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన నల్లబల్లె అంజనమ్మ. పేదరికంలో ఉన్నా అద్భుతాలు సాధించవచ్చని చాటి చెప్పిన ఆమె విజయగాథ ఎంతో మందికి స్ఫూర్తి.వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా వేముల మండలం కొత్తపల్లికి చెందిన నల్లబల్లె అంజనమ్మ డీఎస్సీ (టెట్‌ కంట టీఆర్టీ) తెలుగు భాష ఉపాధ్యాయ పరీక్షలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అంజనమ్మ కుటుంబ నేపథ్యం విషయానికొస్తే ఆమె తండ్రి బాల గంటులు మేకల కాపరి, తల్లి రైతు కూలీ. చిన్ననాటి నుంచి పేదరికంలోనే గడిపారు. పేదరికం కారణంగా ఒకానొక సమయంలో అంజనమ్మ స్కూల్‌ మానేయాల్సి వచ్చింది. కానీ చదువుకోవాలని తనలో ఉన్న తపనతో పట్టువదలకుండా చదువుకుంది. ఎంఈ, బీడీ పూర్తి చేసింది. పీహెచ్‌డీకి అవకాశం వచ్చినా ఆర్థికంగా వెనకబడడంతో చేయలేకపోయింది.అనంతరం జాతీయ, రాష్ట్ర అర్హత పరీక్షలకు(నెట్‌,సెట్‌) కూడా ఉత్తీర్ణురాలై అధ్యాపకురాలు, అసిస్టెంట్‌ టీచర్‌ పోస్టులకు కూడా అంజనమ్మ అర్హత సాధించింది. ఇక తనకు తొలి నుంచి అండగా నిలిచిన తండ్రి తన విజయాన్ని చూడలేపోయారని , ఇటీవలే తండ్రి మరణించారని ఆమె తెలిపారు. నిరుపేద కుటుంబంలో జన్మించి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన అంజనమ్మ విజయ గాథ ఎంతో మందికి ఆదర్శనమడంలో సందేహం లేదు కదూ!

Related Posts