YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్ కు 120కు పైగా సీట్లు

కాంగ్రెస్ కు 120కు పైగా సీట్లు

కర్ణాటకలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు సీఎం సిద్ధ రామయ్య. చాముండేశ్వరి నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అమిత్ షా రోడ్ షోలు, మోదీ ఇమేజ్‌లు ఇక్కడ పనిచేయవని... ఓటర్లపై అసలు ప్రభావమే చూపదన్నారు సీఎం. తమ పార్టీ పూర్తి మెజార్టీ సాధిస్తుందని... ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు. తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని... కాంగ్రెస్‌కు 120కిపైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానంటూ యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలపై సిద్ధరామయ్య స్పందించారు. ఇదంతా చూస్తుంటే... ఆయనకు మతి భ్రమించిందేమోనన్న అనుమానం కలుగుతోందని సెటైర్ వేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు జేడీఎస్ చాలా డబ్బులు పంచిందని... సొసైటీ సెక్రటరీనని చెప్పుకున్న ఆ పార్టీ అభ్యర్థికి అన్ని డబ్బులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. బీజేపీ బహిరంగంగానే జేడీఎస్‌కు మద్దతు ప్రకటించిందని... అందుకే చాముండేశ్వరిలో డమ్మీ అభ్యర్థిని బీజేపీ నిలబెట్టిందని తప్పుపట్టారు. ఇటీవల తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో జరిగిన ఐటీ దాడులపై కూడా సిద్ధరామయ్య స్పందించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో... కాంగ్రెస్ నేతలు, తన అనుచరులపై ఐటీ దాడులు చేయించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పోలింగ్ తర్వాత ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని... అలాగే పార్లమెంట్‌లో కూడా పోరాడతామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్న బీజేపీ విమర్శల్ని తిప్పికొట్టారు. తన రాజకీయ జీవితంలోనే ఇలాంటివి చేయలేదని... తనపై ఆరోపణలు చేసినవాళ్లు చేస్తారేమోనంటూ కౌంటర్ ఇచ్చారు. 

Related Posts