YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బడ్జెట్ లో కనిపించని పోలవరం

బడ్జెట్ లో కనిపించని పోలవరం

ఏలూరు, ఫిబ్రవరి 4,
రాష్ట్ర విభజన చట్టంలోని కీలక జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టుకు తాజా కేంద్ర బడ్జెట్‌లో మొండిచెయ్యి చూపారు. రాష్ట్రానికి జీవనాడి అయిన ఈ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో ఒక్క రూపాయీ కేటాయించని పరిస్థితి. రాష్ట్ర ప్రయోజనాలు ఏ మాత్రమూ పరిగణనలోకి తీసుకోకుండా గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించడం పట్ల రాష్ట్రంలోని సాగునీటిరంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి-కృష్ణా నదులు ఇప్పటికే అనుసంధానం అయిన విషయాన్ని ప్రస్తావించ లేదు. రాష్ట్రంలో చాలా కరువు ప్రాంతాల్లో కనీసం తాగునీటిని కూడా అందించలేని దుస్థితిలో ఉంటే... నదుల అనుసంధానం సాధ్యాసాధ్యా లను నిపుణులు ప్రశ్నిస్తున్నారు. నదుల అనుసంధానం పేరిట కేంద్రం ఆయా రాష్ట్రాల జలవనరుల విషయాల్లో అతిగా జోక్యం చేసుకుంటోందని వారు చెపుతున్నారు. కేంద్ర బడ్జెట్‌లో సాగునీటి రంగానికి కేటాయించిన రూ 6 వేల కోట్లలో రాష్ట్ర వాటా ఎంత వస్తుందనేది చర్చనీయాంశమైంది.మౌలిక సదుపాయాల్లో భాగంగా కీలకమైన జాతీయ రహదారులను 25 వేల కిలోమీటర్ల మేర విస్తరణ కోసం బిఓటి పద్దతిలో రూ.20 వేల కోట్లను సమీకరించనున్నట్లు ప్రకటించిన కేంద్రం కీలకమైన గ్రామీణ రోడ్ల గురించి ఎక్కడా ప్రస్తావన చేయ లేదు. ప్రజా రవాణాకు నిధుల కేటాయింపుల్లేవు. గత ఏడాది బడ్జెట్‌లో నిధులు కేటాయించినా...రాష్ట్రంలోని ఆర్టీసికి అదనంగా ఒక్క బస్సూ సమకూరని పరిస్థితి వుంది. తిరుపతి, విశాఖపట్నం, విజయవాడల్లో విద్యుత్‌ బస్‌లను నడపాలనుకున్న ఆర్టీసికి ఎలాంటి ప్రోత్సాహమూ కనిపించడం లేదు. విద్యుత్‌ వాహనాలకు బ్యాటరీలను ఎక్కడికక్కడ మార్చేలా జాతీయ రహదారులపై బ్యాటరీ ఛార్జింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఈ బడ్జెట్‌లో ప్రకటన చేశారు. ఈ బడ్జెట్‌లో డీజిల్‌, పెట్రోల్‌పై పన్నుల భారాన్ని తగ్గిస్తారనే వాహనదారుల ఆశలకు తాజా బడ్జెట్‌ గండి కొట్టింది.

Related Posts