చిత్తూరు
తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే కలిచర్ల ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. నేడు హైదరాబాద్ నుండి రోడ్డు మార్గాన కలిచర్ల కు చేరుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి వస్తున్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు రాష్ట్ర సరిహద్దుల్లో నే ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కలిచర్ల ప్రభాకర్ రెడ్డి స్వగృహానికి చేరుకుని ఆయన పటానికి నివాళులు అర్పించారు. అటు పిమ్మట దివంగత కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సతీమణి ఇందిరమ్మ ను, మరియు కుటుంబ సభ్యులను పరామర్శించారు. సందర్భంగా అక్కడికి చేరుకున్న ఆయన అభిమానులను ఆప్యాయతతో ముచ్చటించారు.