న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4,
ఒమిక్రాన్ ఎంట్రీతో భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ మొదలైంది.. భారీగా కేసులు వెలుగు చూశాయి.. అయితే, క్రమంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.. కోవిడ్ విజృంభణ సమయంలో కఠిన ఆంక్షలు విధించిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. మళ్లీ సడలింపులు ఇస్తున్నాయి.. కొన్ని రాష్ట్రాలు స్కూళ్లను మూసివేసి.. ఆన్‌లైన్ విద్యకే పరిమితం అయ్యాయి.. ఇప్పుడు మళ్లీ విద్యాసంస్థలను తెరవడంపై ఫోకస్ పెడుతున్నాయి.. ఈ సమయంలో.. స్కూళ్ల పునః ప్రారంభంపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం..పాఠశాలలు ఎప్పుడూ పరిశుభ్రవాతావరణ ఉండేలా చూడాలి. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని కొత్త మార్గదర్శకాల్లో పేర్కొన్న కేంద్రం.. విద్యార్థుల మధ్య 6 అడుగుల దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.. విద్యార్థులతో పాటు సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలని.. మధ్యాహ్న భోజన సమయంలో భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని.. స్కూల్ బస్సులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని పేర్కొంది.. ఇక, హాస్టళ్లలో పిల్లల బెడ్ల మధ్య భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలని దేశించింది.. పిల్లలను స్కూళ్లకు పంపేందుకు ప్రభుత్వాలు తల్లిదండ్రుల అంగీకారం తీసుకోవాలి.. తల్లిదండ్రులు కోరితే ఆన్లైన్ క్లాసులు కూడా కొనసాగించాలి.. భౌతిక దూరం సాధ్యం కానప్పుడు స్కూల్ ఈవెంట్లు నిర్వహించకూడదని కొత్త మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది కేంద్రం.